హ్యాండ్ బాల్ అసోసియేషన్ అత్యవసర సమావేశం

జనం న్యూస్ కోరుట్ల జూన్ 12


ఈ రోజుఉదయం 9.30 నిమిషల కు కోరుట్ల లో ఐలాపూర్ రోడ్ లోని బులియన్ మార్చేంట్ సంఘ భవనం నందు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ అత్యవసర EC సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశానికి రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ సంఘం ఇంచార్జ్ అధ్యక్షులు గొనె శ్యామ్ సుందర్ రావు  అధ్యక్షతన జరుగును. రాష్టంలో అవుతున్న నకిలీ క్రీడా సంఘాల ఏర్పాటు పై మరియు కోచ్ ల యొక్క క్రీడా సంఘాల లో వారి పాత్ర పై చర్చించడం జరుగుతుందని రాష్ట్ర తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్ లు ఒక సంయుక్త ప్రకటన లో తెలిపారు. ఈ సమావేశానికి వివిధ జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షా, ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని కోరారు.