147 ఏళ్ల వయసులో ఈ తాత మనవరాలితో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే షాక్ అవుతారు. (వీడియో చూడండి)
జనం న్యూస్: ప్రస్తుత జనరేషన్ అరవై ఏళ్లు బతికితే గ్రేట్ అంటుంటారు పెద్దవాళ్లు. ఎందుకంటే ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా గుండె నొప్పితో చనిపోతున్నారు. అధిక శాతం యువత షుగర్.. బీపీలతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు.. మారుతున్న జీవన శైలీ కూడా కారణమే.. అప్పటితరం ఎలాంటి అనారోగ్యాలకు గురయ్యేవారు కాదు. చిరుధాన్యలతో కూడిన ఫుడ్ తీసుకునేవారు. వాళ్లు సహజంగా లభించే ఆహార తీసుకునేవారు. ప్రస్తుతం ఆహారం అంతా కలుషితమే. ఆహార పంటలు, కూరగాయల సాగులో ఫెస్టిసైడ్స్ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఆ ఫుడ్ తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.కాగా చాలా మంది వృద్దులు పదుల వయసులో కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉన్నారు కొంతమంది. 100 సంవత్సరాలకు పైగా బ్రతుకుతూ ఆశ్చర్య పరుస్తున్నారు. హ్యాప్పిగా మనుమలతో మునిమనుమలతో ఆడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఓ వృద్దుడు ఏకంగా తన 147 యేటా కూడా తన ఏడో తరం పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాంబోడియా కు చెందిన ఈ 147 ఏళ్ల వృద్ధుడు మంచం పై పడుకొని ఓ పాప తలపై చేయి వేసి ఆడిస్తున్నాడు. ఏడో తరం పిల్లలతో ఆడుకోవడంతో నెటిజన్స్ షాక్ కి గురవుతున్నారు. ఈ వయసులో కూడా వృద్దుడు పిల్లలతో ఆడుకోవడం చూసి గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.