Logo

రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకి ఎంపిక

బూర్గంపహాడ్ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన మేక పున్నం కుమార్తె, 17 ఏళ్ల మేక సృజన తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది. తన ఆట నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సృజన, దేశ స్థాయికి ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.