Logo

గుంతలు గుంతలుగా మారిన పెబ్బేరు కర్నూలు రోడ్ రహదారి

ప్రమాద భరితంగా మారిన పెబ్బేరు నుండి కర్నూలు వెళ్లే మెయిన్ రహదారి

జనం న్యూస్ పెబ్బేర్ అక్టోబర్ 27 : పెబ్బేరు మీదుగా కర్నూలుకు వెళ్లే మెయిన్ రహదారి గుంతల గుంతలుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది దీనికి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికరంగా ప్రయాణం చేస్తున్నారు శనివారం వచ్చిందంటే చాలు కర్నూల్ నుండి పెబ్బేరు మండలానికి చాలా వాహనాలు గొర్లు బర్లు తదితర వాహనాలు వస్తుంటాయి దాంతో రోడ్డు ఇంకా మరీ గుంతలుగా మారి ప్రజలను ఇక్కట్లు పాలుగా చేస్తుంది ఈ రోడ్డు ఈ విషయంపై ఆర్ఎంపి అధికారులు కనీసం ఆ రోడ్లకి అతుకుల బొంతనైనా వేసి ప్రజల యొక్క వాహనాల ఇబ్బందులను ఇక్కట్లను తొలగించవలసిందిగా కోరుచున్నాము ఈ సమస్యను సత్వరమే కొంతమేరైనా తగ్గించవలసిందిగా ఇక్కడి ప్రయాణికులు ఇటుగా వెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు