Logo

ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టేశాడు – ఆ హీరోయిన్ పేరు చెప్పి షాక్ ఇచ్చాడు!

జనం న్యూస్ : తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. నటుడిగా తోపు మాత్రమే కాదు.. వ్యక్తిగానూ ఆయన మనసు అమోఘం. సాటి మనుషులను గౌరవించే విధానం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడటం.. విపత్తులు సంభవించినప్పుడు భారీ ఆర్థికసాయం ప్రకటించడం వంటి గుణాలు ప్రభాస్‌కు వారసత్వంగా వచ్చాయి. గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా స్పిరిట్, ఫౌజి, సలార్2, కల్కి2 ఇంకా చాలా సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. ప్రభాస్ అభిమాన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె‌ ఓ టాప్ హీరోయిన్.. బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే కింగ్ నాగార్జునతో కూడా నటించింది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో రవీనా టాండన్ ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో నటించారు. గతంలో సాహో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఓ బాలీవుడ్ టాక్ షోలో మాట్లాడుతూ.. రవీనా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోయేలా కామెంట్ చేశారు. చిన్నవయసులో రవీనా చిత్రాలు చూసి ఆమె అంటే క్రష్ ఏర్పడిందని, అందుకే మాజీ గాళ్ ఫ్రెండ్ అన్నానని తెలిపారు. వాస్తవానికి తనకు ఎవరూ గాళ్ ఫ్రెండ్స్ లేరని మరోసారి స్పష్టం చేశాడు. ఇక, రవీనా భర్త అనిల్ థడాని తమకు ఎంతో సహకరించారని ప్రభాస్ తెలిపారు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.