Logo

పెబ్బేరులో బాకీ కార్డులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ :అక్టోబర్ 17 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డ్ లో బీసీ కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేసిన పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ చేసారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 5500 వృద్ధులకు వికలాంగులకు ఫించన్ల ద్వారా 44000, రైతులకు రైతు భరోసా ద్వారా 76000 నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా భరోసా విద్యార్థినులకు స్కూటీలు కళ్యాణ లక్ష్మీ ద్వారా తులం బంగారం రైతు కూలీలకు ఉపాధి కూలీలకు రైతు భరోసా వంటివి బకాయి పడ్డారని ప్రజలు ఈ బాకీ కార్డు చూయించి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ చిన్న ఎల్లారెడ్డి గోపి బాబు మాజీ మార్కెట్ వెయిట్ చైర్మన్ ఉన్న విశ్వరూపం శేఖర్ గౌడ్ హరిశంకర్ నాయుడు మజీద్ సొప్పరి బీచ్పల్లి మేకల ఎల్లయ్య సంబురాము ఎద్దుల సాయినాథ్ సంతోష్ వేణు శాంతన్న రమేష్ గౌడ్ నరేష్ బసవరాజ్ గౌడ్ ఎం రాములు గోవర్ధన్ రెడ్డి నాగిరెడ్డి భారతి రమేష్ తదితరులు పాల్గొన్నారు