Logo

తుఫాన్ కష్టాల్లోనూ ప్రజల కోసం నిలబడ్డ మహిళ ఎమ్మెల్యే

జనం న్యూస్ :  ఉభయ గోదావరి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా వెళ్లిన విధానం నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.ప్రధానంగా ఈసారి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల సైతం కీలక పాత్ర వహించారు. ఇది మామూలు తుఫాను కాదంటూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పించడం ముఖ్యంగా సముద్రతీర ప్రాంతంలో ఒక మహిళ ఎమ్మెల్యే చొరవ ఆమె ప్రజలను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం అద్భుతం అంటున్నారు. ఇంతకీ ఎవరు ఆ మహిళ ఎమ్మెల్యే ఆమె ఏం చేశారు.. ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

పేదల కష్టాల్ని చూసి చలించిన తీరు.. తుఫాను వచ్చిందంటే చాలు అధికారులు లేదా ప్రతినిధులు తుఫానుకు ముందు ప్రజలను అలెర్ట్ చేస్తారు. తర్వాత తుఫాను అనంతరం వారి పరిస్థితి చూస్తారు. ఇలా కాకుండా ఆ జిల్లాలో మాత్రం ఈసారి తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు అద్భుతమైన సేవలందించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్, మాజీ మంత్రి యనవల రామకృష్ణుడు కుమార్తె అయిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  యనమల దివ్య కోన ప్రాంతంలో కీ రోలు పోషించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కోన ప్రాంతం అంటే దాదాపుగా సముద్ర తీర ప్రాంతం నిండి ఉన్న ప్రాంతంగా చెప్పబడుతుంది. ఇలాంటి తరుణంలో తన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని గ్రహించారో ఏమో గాని తీరం దాటే క్రమం 12 గంటలు ముందే కోన ప్రాంతానికి చేరుకుని అక్కడే తిష్ట వేశారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రెండు అడుగులు నీరు నిలిచిపోయినప్పటికీ అదే నీటిలో నడిచి వెళుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా మలుచుకున్నారు.