Logo

కర్నూలు బస్సు ప్రమాదం: మరో ట్విస్ట్ బయటపడింది – పూర్తి వివరాలు

జనం న్యూస్: ఈ క్రమంలో అతని బైక్ అలాగే హైవే మీద అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత.. అడ్డంగా పడిన ఆ బైకును తప్పించుకుంటూనే మరో 19 వాహనాలు ఆ మార్గంలో వెళ్లాయని, ఆ తర్వాత వీ.కావేరీ ట్రావెట్ బస్సు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన వీ కావేరీ ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డుమీద అడ్డంగా పడిన బైక్‌ను గమనించక నేరుగా దాని ఎక్కేసింది. ఈ క్రమంలో బైక్ ను 300 మీటర్లు బైకును ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ ఇంజన్, రోడ్డుకు మధ్య రాపిడి జరిగి.. నిప్పురవ్వలు చెలరేగటం, అదే టైంలో బైక్‌ క్యాప్‌ ఊడిపడి పెట్రోల్‌ లీక్‌ కావటంతో మంటలు  అంటుకున్నాయి. అయితే..మంటలను గమనించిన డ్రైవర్‌ లక్ష్మయ్య.. మంటలు విస్తరించే వరకు తన దగ్గరున్న నీళ్ల బాటిల్‌తో మంటలార్పే ప్రయత్నం చేశాడు. కాని.. మంటలు ఎగసిపడడంతో బస్సు దిగి పారిపోయాడు. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ కేసులో A-1 గా డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పేరును చేర్చారు. A-2 గా వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఉంది. ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు వేమూరి కావేరీ ట్రావెల్స్‌ యజమాని. ఇంత ఘోరం జరిగినా.. ఇంకా బస్సు యజమానిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.