అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలో ఆటల పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలో ఆటల పోటీలు

జనం న్యూస్ చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా ఫిబ్రవరి 25: నర్సంపేట శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి సౌజన్యంతో.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రీడా పోటీలను దివి 27, 28, 1 ,2 ,వరుసగా నాలుగు రోజులపాటు చెన్నారావుపేట మండలంలో జాగృతి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతున్నవి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి జడ్పీ ఫ్లోర్ లీడర్, శ్రీమతి పెద్ది స్వప్న ముఖ్య అతిథులుగా 27 నాడు జరిగే ప్రారంభ ఆటలకు రావడం జరుగుతుందనీ, మండలంలోని ప్రజాప్రతినిధులు. మండల అధికారులు, మండలంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మండల సమైక్య అధ్యక్షురాలు ఖర్దురి హైమ, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ తెలియజేశారు.ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ స్థాయి ప్రతిష్టాత్మక ఆటల పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ బహుమతితో పాటు, గెలిచిన వారికి మండల, నియోజకవర్గస్థాయి, నగదు బహుమతులతో పాటు మెమొంటో షీల్డ్ లను అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులు, మహిలా సంఘాల సభ్యులు, మీ గ్రామాల తరఫున ఆటలలో పాల్గొని.. ఆర్థిక సామాజిక చైతన్యంతో పాటు ఆటపాటలలతో ఉత్సాహ ఉల్లాసాలతో ఆరోగ్యాలను పదులపరుచుకునే ఉద్దేశంతో ఈ ఆటలను నియోజకవర్గ ఆటలను ఎమ్మెల్యే ఆడిస్తున్నారని ఏపిఎం ఈశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు.