ఆర్థిక ఇబ్బందులతో సంజీవ్ యువకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో సంజీవ్  యువకుడి ఆత్మహత్య

శివ్వంపేటలో ఉరి వేసుకుని పెద్దకోళ్ల సంజీవ్ మృతి..

పోతులబోగూడలో మంద నాగులు ఆత్మహత్య..

 జనం న్యూస్ డిసెంబర్2.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

ఆటో ఫైనాన్స్ కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన పెద్దకోళ్ల సంజీవ్ (32) గత ఎనిమిది నెలల క్రితం ఒక ఫైనాన్స్ లో ఆటో కొనుగోలు దానిని నడపగా వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటుండగా ఆర్థిక భారం ఎక్కువై, ఆటో ఫైనాన్స్ బాకీ డబ్బులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ మనోవేదనకు గురైన పెద్దకోళ్ల సంజీవ్ ఆదివారం సాయంత్రం ఇంట్లోని ప్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు భార్య పెద్దకోళ్ల శ్రీకన్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.@ పోతులబోగూడలో మంద నాగులు ఆత్మహత్య.. @కొత్తగా కట్టుకున్న ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతులబోగూడ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పోతులబోగూడ గ్రామానికి చెందిన మంద నాగులు (32) గత సంవత్సరం గ్రామంలో కొత్త ఇంటిని నిర్మించుకోవడాని అప్పులు చేయగా అవి తీర్చలేక తీవ్రంగా   ఇబ్బందులు పడుతూ జీవితంపై విరక్తి చెంది అతని పొలానికి దగ్గరలో ఉన్న అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య మంద పుష్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.