ఇదెక్కడి న్యాయం..న్యాయస్థానం ను ఊరవతలికి విసిరేస్తారు
జనం న్యూస్ 21 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పార్టీ కార్యాలయాలు ఊరిలో నిర్మిస్తున్నారు,మార్కెట్ యార్డ్ అంటే రైతులకు సంబంధించిన ఒక వ్యవస్థ....రైతుల ఆస్తి అది...అలాంటి స్థలాల్లో BRS పార్టీ కార్యాలయం వచ్చింది,పట్టణ పోలీస్ స్టేషన్ వచ్చిందిఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వచ్చిందిమరి న్యాయవాదుల న్యాయమయిన కోరిక ఎందుకు కనబడదో అర్థం కావడం లేదు,మీరు అనుకుంటే పేదల ప్లాట్ లల్లో మెడికల్ కాలేజి వస్తది,అదే స్థలం లో నర్సింగ్ కాలేజి వస్తది,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయి.మరి ఎందుకు న్యాయవాదుల న్యాయమయిన కోరిక కనబడ్తాలేదో అర్థం కావట్లేదుమెజారిటీ న్యాయవాదులు ఈ నిరసనకు కలసికట్టుగా పోరాటం చేస్తుంటే వారి వైపు కన్నెత్తి చూడడం లేదు, వారి సమస్యలకు స్పందించడం లేదు,దింట్లో ఈ న్యాయవాదులకు ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి వ్యాపార పరమయిన లావాదేవీలు లేవు,ఎటువంటి నయవంచన లేదు ప్రజలకు కోర్టు కు ఉన్న సంబంధం కేసులు ఉన్న కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ను దూరదృష్టితో ఆలోచించి న్యాయబద్ధమైన నిరసన చేస్తున్న ఈ న్యాయవాదులకు జిల్లా ప్రజలందరము మద్దత్తు గా నిలుద్దాం సంఘీభావం తెలుపుదాం న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి