కనిపెట్టండి చూద్దాం.. ఈ ఫొటోలో ఒక పాము దాక్కొని ఉంది దానిని కనిపెడితే మీ కంటిచూపు బేష్...
జనం న్యూస్: ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్.. మనల్ని చీట్ చేస్తాయి. కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచించకపోతే మనం బోర్లా పడటం ఖాయం. మన కళ్లే మనల్ని మాయ చేసేస్తాయి. అక్కడ ఉండేది ఒకటి.. మనకు కనపడేది ఇంకొంకటి. ఇలా మనల్ని తికమక పెడుతూ మన బుర్రను హీటెక్కిస్తాయి ఈ పజిల్స్. ఇలాంటి ఫోటో పజిల్స్ ను సాల్వ్ చేయడాన్ని చాలామంది సవాల్‌గా తీసకుంటారు. ఈరోజుల్లో ఇలాంటి పజిల్స్ అందించేందుకు ఇంటర్నెట్‌లో బోలెడన్ని పేజెస్ కూడా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలాంటి పజిల్స్ లెక్క తేల్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాంటి ఓ ట్రిక్కీ పజిల్‌ను మీ కోసం తెచ్చేశాం. పైన ఇచ్చిన.. ఫోటోలో మీకేం కనిపిస్తోంది. ఏముంది అక్కడ అంతా చెత్తా చెదారం అని ఠక్కున అనేయకండి. అక్కడ ఓ విషపూరిత పాము మాటు వేసి దాగి ఉంది. అక్కడున్న వేస్ట్ మధ్య దాన్ని గుర్తించడం ఓ సవాలే. పరిశీలన శక్తి అధికంగా ఉన్నవారు.. ఐ ఫోకస్ స్పష్టంగా ఉన్నవారు… 30 సెకన్లలో దాని ఆచూకి పట్టుగలరు. మీ కళ్లల్లో పవర్ ఉంది అని నిరూపించుకోవాలంటే ఆ పాము జాడ కనిపెట్టండి. కాస్త దృష్టి పెట్టి వెతకండి.. ఏదో పైపైన చేసి చేతులెత్తేస్తే కుదరదు. ఏంటి ఎంత వెతికినా దొరకట్లేదా.. ఇక ఏం చేస్తాం.. ఆ ఆన్సరేదో మేమే ఇచ్చేస్తాం. అక్కడ తల మాత్రం పైకి పెట్టి మాటు వేసి ఉంది ఆ పాము. ఈసారి ఇలాంటి పజిల్స్ ఇచ్చిన్నప్పుడు మాత్రం కాస్త ఫోకస్ పెట్టి చూడండి.. మీరే విన్నర్స్ అవుతారు.