చీకట్లో కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు హడల్..

చీకట్లో కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు హడల్..

జనం న్యూస్: అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌లో ఉన్న రియో గ్రాండే వ్యాలీలో ఓ మిస్టరీ యానిమల్ కనిపించింది. ఇంతకీ ఆ జంతువు అరుదైన జాతికి చెందినదా.. లేక స్థానికంగా ఉన్న జూ నుంచి తప్పించుకుని అక్కడ తిరుగుతోందా అనేది అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఆ జంతువు ఒళ్లంతా జుట్టుతో.. పొట్టిగా నాలుగు కాళ్లతో.. ఓ భారీ సైజ్ ఎలుకలా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ జంతువును పెద్ద సైజ్ ఎలుక అని కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు ఎలుగుబంటి అని.. మరికొందరు బెవురూ, క్యాప్బారా, వోల్వేరిన్, బ్యాడ్జర్ అంటూ తమదైన శైలి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ జంతువు ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.