టీవీ9 ప్రతినిధిపై దాడిని ఖండించిన (కేజేడబ్ల్యుఏ) కందుకూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్
సబ్ కలెక్టర్, డీవైఎస్పీ లకు వినతిపత్రం అందజేత
టీవీ9 ప్రతినిధి రంజిత్ న్యూస్ కవరేజ్ చేస్తుండగా సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడి హేయమైన చర్యగా కందుకూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేజేడబ్ల్యూఏ) అధ్యక్ష, కార్యదర్శులు యర్రంశెట్టి ఆనందమోహన్, ద్రోణాదుల చైతన్య లు తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్, డి.ఎస్.పి కార్యాలయాలలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, డిఎస్పి సిహెచ్ వి. బాలసుబ్రమణ్యంలకు టీవీ9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చర్యలు జర్నలిస్ట్ లకు కొత్తేమి కాదని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. గతంలో కూడా అనేక పత్రికలు, మీడియా చానళ్ళపై దాడులు జరిగాయాని, సమాజానికి మేలుచేసే ప్రక్రియలో ప్రజలను చైతన్య పరిచేందుకు నిరంతరం కృషి చేసే పాత్రికేయులు, మీడియా ప్రతినిధులుపై దాడులను అరికట్టేందుకు, జర్నలిస్ట్ ల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. తీసుకొచ్చిన చట్టాలను నాయకులు, అధికారులు, పోలీసు యంత్రాంగం సక్రమంగా అమలు పరిచేలా చూడాలని అన్నారు. నాలుగవ పిల్లర్ గా పిలబడే మీడియాపై దాడులు చేయటం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో కందుకూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌడపేరు రామయ్య, ముఖ్య సలహాదారులు పసుపులేటి పాపారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ, కోశాధికారి చక్కాకేశవరావు, ఉపాధ్యక్షులు ద్రోణాదుల సురేష్, ద్రోణాదుల అజయ్ కుమార్, కళ్యాణ్, సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, నాయకులు బూసి సురేష్ బాబు, షేక్.యాసిన్, నీలిశెట్టి కృష్ణబాబు, ఎండూరి శ్రీకాంత్, బాబురావు తదితరులు ఉన్నారు.