పిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి
గిరిజన సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు సూర్యం చౌహన్.....
ఆంధ్రలో హతీరామ్ బావాజీ మఠం భూములను ప్రభుత్వం పరిరక్షించాలి....
పార్లమెంట్ లో లక్కీషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలని సూర్య చౌహాన్ డిమాండ్....
జనం న్యూస్ డిసెంబర్11.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజైన పిబ్రవరి 15న ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని బంజారా నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. శివ్వంపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గిరిజన సంక్షేమ సంఘం నర్సాపూర్ తాలూకా అధ్యక్షులు మూడ్ సూర్యం చౌహన్ విలేకరులతోమాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బంజారాలు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నప్పటికి ఇప్పటికి కూడ ప్రభుత్వాలు గిరిజనుల డిమాండ్ లను పట్టించుకున్న పాపాన పోలేదని సూర్యం చౌహాన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి సమీపంలో గతంలో బంజారా గురువు హతిరామ్ బావాజీ మఠం ఉండేదని, అందుకు సంబందించిన ఆస్తులు, భూములు ఉండేవని, వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడి, వెంకన్న మనసును దోచుకున్న హతిరామ్ బావాజీ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి పూజలు చేసిన చరిత్రను కొందరు కావాలనే తొక్కిపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హతిరామ్ బావాజీ ఆస్తులను పరిరక్షించి హతిరామ్ బావాజీ చరిత్రను సమాజానికి తెలియజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో లక్కీషా బంజారా గురువుకు గతంలో ఢిల్లీ పరిసర ప్రాంతంలో వేల ఎకరాల భూములు, ఆస్తులు ఉండేవని, ఆయన మరణానతరం భూములు అక్రమంగా కబ్జాకు గురయ్యాయని, ప్రస్తుత నూతన పార్లమెంట్ భవనం లక్కీషా భూములలోనే ప్రభుత్వం నిర్మించిందని, లక్కీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంట్ లో ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. బంజారాలు మాట్లాడే గోర్ భోలి బాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్డ్ లో చేర్చి అధికారికంగా ప్రకటించాలని, తపస్వి రాంరావ్ మహారాజ్ కు ప్రభుత్వం భారతరత్న అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు సూర్యం చౌహన్, బంజారా నాయకులు రవి నాయక్, గేమ్ సింగ్, గన్య, పూల్ సింగ్, నాజం నాయక్, బబ్బర్ సింగ్, గోపాల్, శంకర్, రవి, మోహన్, మాన్య, రవి, జైసింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.