ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఒక వరం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటిసునీత లక్ష్మారెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఒక వరం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటిసునీత లక్ష్మారెడ్డి

కొత్తపేట గ్రామానికి చెందిన ఆశమొల్ల అశోక్ కు 45 వేల రూపాయలు చెక్కును అందించిన నాయకులు...

 జనం న్యూస్ నవంబర్ 23.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బాధితులకు ఆర్థికంగా బాసటగా నిలుస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి  సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆశమొల్ల అశోక్ కు ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో ప్రభుత్వం నుండి మంజూరైన 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ పండ్ చెక్కును శనివారం పిల్లుట్ల గ్రామంలో మండల సీనియర్ నాయకులు  నాయిని దామోదర్ రెడ్డి, చింత స్వామి, బబ్బురి వెంకటేష్ యాదవ్, పిల్లి శివకుమార్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్బంగా చింత స్వామి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కొత్తపేట ఆశమొల్ల అశోక్ ను ప్రభుత్వం నుండి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చొరవతో సీఎం రిలీఫ్ పండ్ చెక్కును మంజూరు చేయించడం గొప్పదని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో హంసాన్ పల్లి రాంరెడ్డి, డాక్టర్ సండ్ర సుదర్శన్, పెద్దగౌడ బుర్ర పెద్దపోచగౌడ్,  పిల్లి కృష్ణ, కమ్మరి సురేష్, బోను పుల్లయ్య, గుల్లయ్యగారి రాములు,జనుముల గణేష్, పిల్లి పెద్ద వెంకటయ్య, కిష్టయ్య, సాలే వెంకటేష్, కర్రె శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీనివాస్, చిన్న వెంకటయ్య, మోనెగారి సత్తయ్య, డప్పు వెంకటేష్, గాండ్ల రాములు, మంగళపర్తి మల్లేష్, గాండ్ల అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.