అందరు తప్పకుండా చదవాలి...అంబేద్కర్ ది ఒకటే లక్ష్యం‌

అందరు తప్పకుండా చదవాలి...అంబేద్కర్ ది ఒకటే లక్ష్యం‌

జనం న్యూస్ 10ఏప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.

భారతదేశంలో పేదరికం పోవాలని పేదలు చదువుకుని బాగుపడాలని రాజ్యాంగం తెలుసుకుని ఓటు ద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలని

 ఒకటే గమ్యం.. తన జాతి (పేదప్రజలు)పైకి రావాలని

అకుంటిత దీక్ష..
మనుష్యులంతా ఒక్కటే అవ్వాలని
కుల మతాలు లేకుండా Only Indian మాత్రమేవుండాలని. అనితర సాధ్యమైన శ్రమతో అది తన ద్వారా సాధ్యం చెయ్యాలని

వెరసి..అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి చూపించి కోట్లాది దళిత, బడుగుల‌ , భారతీయుల చీకటి జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు

ఎప్పుడూ దండాలు పెట్టడమే తెలిసిన దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించి వాళ్లకు దండాలు పెట్టించుకునేలా చేసిన మహానీయుడు.    
ఓటు కోసం మీ ఇంటికే వచ్చి మీకు దండం పెట్టీ మొక్కే విధంగా ఏర్పాటు చేసిన వైతాళికుడు 
                 
 దళితులు చదవడానికి వీలులేదు మూడు వర్ణాల సేవలో వీళ్ళు జీవితాలు తరించాలని వీరి నుదుటిన బ్రహ్మ వ్రాసిన రాత  అని చెప్పబడుతున్న మనుధర్మ శాస్త్రాన్ని ఆ..కాలంలోనే చితి మంటల్లో బూడిద చేసిన పోరాట యోధుడు
విశ్వ రత్న, భారత జాతి పిత ఆర్థిక శాస్త్రవేత్త రాజ్యంగ నిర్మాత బోది సత్వుడు 
రిజర్వ్ బ్యాంక్ నిర్మాత
హక్కుల సూరీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు

ప్రపంచం లొనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారా మన జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగించి మనలో ఒక IAS IPS IRS డాక్టర్స్, ఇంజినీర్స్,లాయర్ లు,టీచర్లు రాజకీయ నాయకులు ముఖ్యంగా మనుషులుగా తీర్చిదిద్ధిన మహనీయుడు  బాబాసాహెబ్ అంబేద్కరుడు.
దళిత బహుజనులే కాక భారతీయ స్త్రీలను పడక గదికి వంట గదికే పరిమితం చేస్తే...వారిని మనుషులుగా గుర్తించి హక్కులు కల్పించి స్వేచ్ఛ సమానత్వం కల్పించిన మానవతావాది

తన జాతి మాత్రమే కాదు 
దేశంలో ప్రతి మనిషి హక్కులతో బ్రతకాలని ఆర్దికంగా ఎదగాలని తద్వారా  దేశం అభివద్ది చెందుతుందని రేయింబవళ్ళు పని చేశారు  ఆయన గురించి రాజ్యాంగ హక్కుల గురించి ఆయన విలువల గురించి పడ్డ కష్టాల గురించి తెలియనీ యకుండాచేసారు
 మనం పూర్తిగా తెలుసుకుందాం...
 మనసులో ఆయన్ను తల్చుకుందాం...
 పిల్లలకు చెబుదాం...
సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెద్దాం...

అంతా.. ఆయన వల్లే
ఆయనే లేకుంటే మనమెక్కడ

 *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. అభిమాని :- కంటె ఏలియా.
అక్కెనపల్లి