ఉప్పాకలో విషాదం

ఉప్పాకలో విషాదం
ఉప్పాకలో విషాదం

- 8 నెలల గర్భిణి ఉరివేసుకుని మృతి

- భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. అంబులెన్సు లో భద్రాచలం ఆసుపత్రికి తరలింపు 

జనం న్యూస్ అక్టోబర్ 5( పెనపాక మండలం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఉప్పాక గ్రామంలో బుధవారం ఘోర విషాదం చోటు చేసుకుంది. 

క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న ఓ నిర్ణయం భార్య నిండు ప్రాణాలను బలితీసుకోగా, భర్తప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళ్తే పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన కాలేవారు సాయి కుమార్ (BC -వంజరి ), ఉప్పాక పంచాయతీకి చెందిన గిరిజన యువతి కారం స్వప్న ఇద్దరూ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వప్న స్థానిక భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుండగా, సాయికుమార్ 108 వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో స్వప్న ఇంటిలోనే ఉరివేసుకోగా, కడుపులోని 8 నెలల బిడ్డతో సహా మరణించింది. భర్త సాయి కుమార్ మణుగూరు శివారులోని పాత ఇసుక బంకర్ వద్ద పురుగుల మందు తాగాడు, పరిస్థితి విషమంగా ఉంది . స్వప్న మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.