ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 14 శాయంపేట మండలం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్  134వ  జయంతి వేడుకలు. జరిపారు
 బిఆర్ఎస్ యూత్ నాయకులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి కూతాటి రమేష్ బలంతుల రాజు   పోషాలు ఉన్నారు.
దళిత బంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
కాంగ్రెస్ పార్టీకి దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని కొనసాగించాలి.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించి నిర్మించి దాని ద్వారా కుల వివక్ష నుండి విముక్తి కల్పించిన మహానుభావుడు భారత దేశంలో  పుట్టిన ప్రతి బిడ్డకి సమాన హక్కులు కల్పించి చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా చిన్న రాష్ట్రాలతోని భారతదేశం అభివృద్ధి చెందుతుందని గ్రహించి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో పొందుపరిచి తెలంగాణ రాష్ట్ర అమలుకు కెసిఆర్  నాయకత్వంలో చేసిన పోరాటానికి భారత రాజ్యాంగంలో నిర్మించిన ఆర్టికల్ 19 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడం జరిగింది ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్  నాయకత్వం లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు దేశం లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని కొనియాడారు దళిత బంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఘనుడు కేసీఆర్  అని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై మూడు నెలల అయినప్పటికీ దళితులకు ఎటువంటి హామీలు అమలు చేయక తెలంగాణ ప్రజలనే మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలు తగిన పాఠం చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు......