పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుగా నడిగడ్డ వాసి

పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుగా నడిగడ్డ వాసి

జనం న్యూస్ 23 ఏప్రిల్ 2024. 
పదేళ్ల అభివృద్ధికి ఓటేద్దామా.. వందరోజు అబద్దానికి ఓటేద్దామా? 
బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు శ్రీరామరక్ష ... కెటిఆర్ వారంటీ గారెంటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలు

 రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు కేసీఆర్ అయితే... ఢిల్లీ నాయకులతో శభాష్ అనిపించుకోవడం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేద ప్రజలకు  అభివృద్ధి సంక్షేమ పథకాలు 

 కాంగ్రెస్ సర్కారు వంద రోజులకే  కరువు కాటకాలకు  నిలయంగా మారిన మళ్లీ తెలంగాణ రాష్ట్ర

 ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 


 నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపిద్దాం ఢిల్లీలో తెలంగాణ వాణిగా వినిపిద్దాం 
 


ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా లో అలంపూర్ నియోజకవర్గం కేంద్రంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్లో  నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటిఆర్ గారు  , మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గద్వాల ఎమ్మెల్యే  శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు   హాజరయ్యారు...

 బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గద్వాల ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు.... 

 ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ..... 

తెలంగాణ రాష్ట్ర పదేళ్లు కెసిఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉమా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు లాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన నాయకుడు కేసీఆర్ గారిని పేర్కొన్నారు.

  ఆరు గ్యారెంటీల అమలు దేవునికే తెలుసు ప్రజల పరిస్థితి రైతుల పరిస్థితి చాలా దీనమైన పరిస్థితిగా మారింది సరైన కరెంటు నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే . త్వరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో గ్రామాలలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసే పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

 

  మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ....*

60 ఏళ్లు లో కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పదేళ్లలో కేసీఆర్ గారి పాలనలో సాధ్యం చేసుకోవడం జరిగింది. తెలంగాణలో కెసిఆర్ గారి పాలనలోనే ప్రజలకు మేలు జలరం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఈ 100 రోజులు ఆరు గ్యారెంటీలు ఏ మాత్రం కూడా ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు కేవలం మాటలకే పరిమితమైనవి ప్రజల్లోకి ఈ పథకాలు వెళ్లే పరిస్థితి లేదు ప్రజలకు మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని చేపట్టుకున్నారు. కెసిఆర్ పాలనలోని అమలైన సంక్షేమ పథలను ఆపివేసి ఆరు గ్యారెంటీలు ప్రజలకు మేలు చేస్తాయని మాయ మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో రాహుల్ గాంధీ గెలిస్తే ఈ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు అవుతాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉన్నదని అన్నారు.

 
ఈమధ్య కొత్తగా దేవుళ్ళ పైన ఒట్టు వేసి రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తానని మాయ మాటలు చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందేమో డిసెంబర్ 9వ తేదీ నాడు అన్నారు. మళ్లీ ఎప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు ఆగస్టు 15 లోపు అంటున్నారు అస్సలు మాట మీద నిలబడని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు వృత్తి మాటలు చేతలు ఏమీ లేవు సూచించారు. కాబట్టి ప్రజలందరూ త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
  

  మంత్రి వర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్  గారు మాట్లాడుతూ.....* 

 తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసుకోవడం జరిగింది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి పేదింటి వారికి నేరుగా సంక్షేమ పథకాలను అందించిన నాయకుడు కేసీఆర్ గారు. గత 60 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలోని రైతులు ప్రజలు మహారాష్ట్ర కర్ణాటక  వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లేవారు కెసిఆర్ గారి పాలన లో రైతులకు సరైన సమయంలో నీళ్లు కరెంటు లభించడంతో తిరిగి ఈ ప్రాంతంలో వచ్చి వారు వ్యవసాయ పనులు చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అనేకమైన సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిని ఆదుకొని జరిగింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం  కృషి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచంలోని ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అభివృద్ధి కోసం దళిత బంధువును ప్రవేశపెట్టి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా గిరిజన తండాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి వారి పరిపాలన వారు జరిపే విధంగా కృషి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇలాంటి నాయకుడు ఇప్పుడు లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది గొప్ప నాయకున్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు.

  ఈ కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి 420 హామీలను  ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చే విధంగా కృషి చేస్తామని కొట్టి మాయ మాటలు చెప్పారు. కేవలం వారి స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను మోసం చేశారు. ఆరు గ్యారెంటీల లను వారంటీ ల లేని విధంగా మార్చారు ఏ ఒక్క పథకం కూడా వేయలేదు ప్రజలకు మేలు కాలేదు ఏదో బస్సు పథకం మాత్రమే కొంత అయింది దానివల్ల ఎన్నో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సరైన సౌకర్యం లేక బస్సులో ప్రయాణం చేయలేక ఎన్నో ఇబ్బందులను పడే పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. 

రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తేదీ రైతుల ఖాతాలో ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. మళ్లీ ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ప్రజలకు మోసం చేస్తూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్న రేటెంత రెడ్డి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతుబంధు లేదు రైతు రుణమాఫీ లేదు రైతు బీమా లేదు ఇలాంటి హామీ లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసమే కృషి చేస్తున్నాడు టిఆర్ఎస్ లో గెలుపొందిన నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువానికి వారికి పార్టీలోకి ఆహ్వానించే పనిగా చేపట్టడం జరుగుతుందని అన్నారు.

  రైతుల కోసం ఆనాడు కెసిఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశిస్తే ఈ నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రైతులకు డిసెంబర్ 9వ తేదీ నాడే రుణమాఫీ చేస్తానని అన్నారు కానీ ఇప్పటికి వంద రోజులు అయింది రైతులకు రుణమాఫీ మాట దేవుడెరుగు రైతుబంధు రైతు బీమా గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులను విడుదల చేస్తానంటే అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు కుట్ర పూర్వకంగా రైతులు అభివృద్ధి చెందితే అనే భయంతో రైతులను మళ్లీ పూర్వ వైభోగం వచ్చే విధంగా ఈ ప్రాంతంలోని పాలమూరు రైతులు మళ్లీ పరాయి దేశాలకు పరాయి రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది.

 బిజెపి పార్టీ నాయకులు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పదేళ్లలో కృష్ణా జలాల వాటాల గురించి అడగడం జరిగింది. వాటాలను ఇప్పటివరకు కూడా ఆంధ్ర తెలంగాణ వాటాలను వేరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేదు.  ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతూ కేవలం మతం పేరుతో జైశ్రీరామ్ అనే విధానంతో రాజకీయం చేస్తూ ఉన్నారు. మేము కూడా హిందువులమే మేము కూడా శ్రీరాముని పూజిస్తాం కానీ ఏనాడు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదు కేసీఆర్ గారు తెలంగాణలో ఎంతో అద్భుతమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్మించారు. 
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తాది భిన్నత్వంలో ఏకత్వం వలే కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి అన్ని వర్గాల ప్రజలకు కోసం కృషి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని గర్వంగా చెప్పారు. కాబట్టి ప్రజలారా  తెలంగాణలో బిజెపికి, కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలి ప్రజలందరూ ఈ సమరానికి సిద్ధంగా ఉండాలి రాబోయే ఎన్నికలలో సత్తాని చూపాలి అని తెలిపారు.


 త్వరలో జరగబోయే పార్లమెంటు లో ఎన్నికల నాగర్ కర్నూల్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి  మన ప్రాంత వాసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మే 13 తేదీ నాడు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.

  నాగర్ కర్నూల్ పార్లమెంట్  అభ్యర్థి మాట్లాడుతూ...


   నేను నడిగడ్డ వాసిని. బహుజన బిడ్డని. బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది.

  నేడు పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధికి 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి జరిగే పోటీలలో ప్రజలు ఎటువైపు తీర్పిస్తారో మీరే నిర్ణయించుకోండి.

  తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఎన్నో అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేరుగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా సంక్షేమ పథకాలను అందించిన నాయకుడు కేసీఆర్ గారిని గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆనాడు కెసిఆర్ గారు అహర్నిశలు శ్రమించడం జరిగింది రైతులకు అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. నేను పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కెసిఆర్ గారు నిర్వహించిన  గురుకుల పాఠశాలకు కార్యదర్శిగా పనిచేసే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలను చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఎంతోమంది విద్యార్థులు నేడు ఐఏఎస్ ఐపీఎస్ ఆర్మీ, డాక్టర్ పోలీస్ లాంటి ఎన్నో సంస్థలలో ఉద్యోగాలను సాధించడం జరిగింది. 

    తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని పనిచేయాలని  బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీలో చేరే సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో ప్రలోవలాలకు గురి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వస్తే రాష్ట్రస్థాయి పదవి ఇస్తామని ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని తిరస్కరించి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధమయ్యాను.

నేను కూడా పాలమూరు బిడ్డని నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం జరుగుతుంది. మనమందరం కూడా పాలమూరు బిడ్డలమే పాలమూరు గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరు పాలమూరు బిడ్డ
పాలమూరు అభివృద్ధి కోసం నువ్వు ఏనాడైనా కృషి చేశావా మూడు నెలలు కావడం జరుగుతుంది పాలమూరులో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశావా. అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నేడు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే కోరడం జరుగుతుంది నీళ్లు లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కోవడం జరుగుతుంది నేడు వారి పరామర్శించడానికి బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ గారు తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కూడా రైతుల కోసం సూర్యాపేట నల్లగొండ జిల్లాలకు వెళ్లి రైతుల కష్టసుఖాలను తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఏ నేత కాంగ్రెస్కు వస్తాడా ఏ నేతను కాంగ్రెస్ పార్టీలో చేరికలు చేద్దాం అనే దిశలో వైపుగా వెళుతున్నారు రైతుల పక్షాన గాని ప్రజల పక్షాన గాని బలుగు బలహీన వర్గాల పక్షాన గాని ఏమాత్రం కూడా ఏ చిన్నంత కూడా ఆలోచన చేయడం లేదు ఇలాంటి అసమర్ధ ముఖ్యమంత్రికి  త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరు తగిన గుణపాఠం చెప్పే విధంగా కృషి చేయాలి అని తెలిపారు.

  
  ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు నేనే ఎంపీ అభ్యర్థిని నేనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భావించి గ్రామ గ్రామాలలో ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రచారంలో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపు విషయాలను ప్రజలకు దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించి త్వరలో జరగబోయే మే 13వ తేదీ నాడున నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలకు కారు గుర్తుపైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
????ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్ లు , ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగర్ దొడ్డి వెంకట రాములు, గడ్డం కృష్ణారెడ్డి, అలంపూర్ నియోజకవర్గం ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా