పూర్ణ, పుష్కలాంబలు ఎవరు ? పురాణ కథ తెలుసుకుందాం?

పూర్ణ, పుష్కలాంబలు ఎవరు ? పురాణ కథ తెలుసుకుందాం?

విజయవాడ జనం న్యూస్  ప్రతినిధి.. పూర్ణ, పుష్కల అనే ఈ ఇరువురు శ్రీధర్మశాస్తా యొక్క ధర్మపత్నులు.మానవ జీవితానికి పూర్ణత్వాన్ని ప్రసాదించడం కోసం, శ్రీ ధర్మశాస్తా “పూర్ణ" అనే భార్యను కలిగియున్నాడు.ఐశ్వర్యాలనెన్నిటిని  పుష్కలంగా మనకు అనుగ్రహించడం కోసం, శ్రీధర్మశాస్తా 'పుష్కల” అనే భార్యను కలిగియున్నాడు.ఈ ఇరువురిని తలచి, “పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర స్వామినే నమ:” అని అర్చిస్తున్నాం కనుక, మనం చేసే పూజలు ధర్మశాస్తాకు చెందినవే అని, దీక్షా కాలంలో మనం రెండుపూటలా ధర్మశాస్తాను అర్చిస్తున్నాం అని బోధపడింది కదా అలాగే శ్రీ ధర్మశాస్త్ర వారు ఎ కారణం చేత పూర్ణ పుష్కల నీ వివాహం చేసుకున్నాడు పురాణగాధ తెలుసుకుందాం…విష్ణుమూర్తి పదవ  అవతారాలలో 6 వా అవతారంగా జన్మ ఎత్తిన పరశురాముడు తాను సృష్టించిన మలయాళ భూభాగంలో అధర్మం రాజ్యమేలాడము  చూసి భూలోకంలో మరల ధర్మసంస్థాపన చేయవలసిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ధర్మ రక్షణకై శివుని వేడుకొనుట కు కైలాసం బయలుదేరును…ఆ మహా శివుని దర్శించి తాను వచ్చిన కార్యం తెలిపెను ఆ మహాశివుడు పరశురాముని ధర్మశాస్త్ర వద్దకు పంపెను…పరుశరాముడు ధర్మశాస్త్ర ను భూలోకమున ధర్మ స్థాపన గావించమని వేడుకొనెను ధర్మ సంరక్షకై భూలోకం రమ్మని ప్రార్ధించెను.అంతట దేవతలు దేవర్షులు భూత గణములు ధర్మశాస్త్ర వారు కైలాసం విడిచినచొ ధర్మశాస్త్ర వారి దర్శన భాగ్యం తమకు దూరమగును అని చింతించి కాస్త వారు భూలోకమును వెళ్లకూడదని వేడుకొన్నారు.పరశురాముడు దేవతలందరికీ నమస్కరించి ఓ దేవతలారా సకల లోకాలను రక్షించవలసిన మీరే ఈ విధంగా చింతించుట సరికాదు ధర్మశాస్త్ర వారు ఎక్కడ ఉన్నా మీకు ప్రతిరోజు ఆయన దర్శన భాగ్యం  కలుగ ఏర్పాట్లు నేను చేసెదనని దేవతలందరికీ మాట ఇచ్చి వారికి నచ్చజెప్పిను.పరుశరాముడు మాటలకు దేవతలు పరమానందమై ధర్మశాస్త్ర వారు భూలోక పయనానికి సమ్మతించెను. అంతట పరుశరాముడు దేవశిల్పి అయిన విశ్వకర్మ ను ప్రార్ధించెను తన కేరళ క్షేత్రమున శ్రీ ధర్మశాస్త్ర వారికోసం ఒక స్వర్ణ దేవాలయం భూమిని తాకని విధంగా నిర్మించమని వేడుకొనెను.పరశురాముడు సూచించిన విధంగా విశ్వకర్మ సమ్మతించెను ఆలయ నిర్మాణం కోసం విశ్వకర్మ వారు పొన్నంబల మెడు చేరుకుని పొన్నంబల మెడులో స్వర్ణ దేవాలయం నిర్మించెను.ఇక్కడ ముఖ్య విషయం మానవులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది…భూలోకమున ఒక సంవత్సర కాలము అనగా 365 రోజులకు గాను దేవతలకు ఒక్కరోజు అవును దేవతలకు ఉత్తరాయణం పగలు గాను దక్షిణాయనం రాత్రిగా ను పరిగణింపబడుతుంది ప్రతిరోజు దేవతలు ఋషులు దేవతాగణములు తమ ప్రాతఃకాలమున అనగా భూలోకములో ఉత్తరాయణ కాలం ప్రారంభంలో భూలోకమునకు వచ్చి ధర్మశాస్త్ర వారిని దర్శించి భక్తిశ్రద్ధలతో పూజించేదరు ఆ సమయంలోనే పొన్నంబల మేడలో ఆ దేవదేవుడైన ధర్మశాస్త్ర వారికి ఇచ్చే ఆరతి మనము మకర సంక్రాంతి రోజున వీక్షించే దివ్యమైన మకరజ్యోతి ఈ దివ్య జ్యోతిని తిలకించి హారతి కి నమస్కరించి దేవతలందరూ తిరిగి వెళతారు భక్తులకు సూచన మకర జ్యోతి నిజానిజాలు మకర జ్యోతి మన కోసమా దేవతల కోసమా మకర జ్యోతి లో మర్మాలు ఇప్పుడు ఎందుకు మకరజ్యోతి పై వాదనలు మకరజ్యోతి నిజానిజాలు మరి ఒక రోజు తెలుసుకుందాం.పరశురాముని కోరికమేరకు భూలోకంలో అధర్మం నశిస్తుంది సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ ధర్మ శాస్త వారు భూలోకం విచ్చేసి కేరళ రాష్ట్రంలోని బృందావనములో ధ్యానం చేస్తూ ఆ పర్వతాల లో నివసించు భూలోకంలో ధర్మసంస్థాపన చేయుచుండెనుశ్రీ ధర్మశాస్త్ర వారు భూలోకమున ధర్మసంస్థాపన చేయుచున్న సందర్భంలో నీ పాల దేశమును నేటి నేపాల్ దేశం ఫలింజ వర్మన్ అను రాజు పరిపాలించు పొందెను అతనికి పుష్కల అను కుమార్తె కలదు ఆమె అతిలోకసుందరి ఆ పరమశివుని భక్తురాలు నిత్యం పరమ శివుని ధ్యానిస్తూ ఆ మహా శివుని నామస్మరణ చేయుచుండెను ఒకమారు నేపాల రాజ్యమున తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడును రాజ్యంలో ప్రజలు ఆకలితో మరణించు చుండెను.ఆ నే పాల రాజు తన రాజ్య దుస్థితి చూసి చింతించు చున్నా సమయంలో ఒక బేతాళ మాంత్రికుడు రాజు వద్దకు వచ్చి ఓ రాజా నీ రాజ్యము కరువుకాటకాలతో కొట్టుమిట్టాడుతున్నది నీ రాజ్యాన్ని ఈ పరిస్థితి నుండి నేను కాపాడగలరు అనే రాజుకు ఆశ కల్పించినారు.ఆ రాజు మాంత్రికుని మాటలు నమ్మి ఏమిచేయాలో సెలవివ్వండి అనెను దానికి ఆ మాంత్రికుడు ఓ రాజా నీ కుమార్తె పుష్కల దేవిని కాళికాదేవికి బలి ఇచ్చిన ఆ కాళికాదేవి శాంతించి ఈ రాజ్యాన్ని కాపాడగలదు నా మాటలు నమ్ము సమయము లేదు రాజ అని ఒత్తిడి చేసిండు మాంత్రికుడు.ఆ మాంత్రికుని ముఖ్య ఉద్దేశము దేవ లగ్నంలో జన్మించిన అదృష్ట జాతకు రాలైన పుష్కల దేవిని కాళికాదేవికి బలి ఇచ్చి మాంత్రికుడు వరము పొందాలని కపట ఉపాయము చేసినాడు.ఆ నేపాల రాజు తన రాజ్యంలోని ప్రజలను కాపాడుకోవాలని తొందరలో అందుకు అంగీకరించెను తన తండ్రి ఇచ్చిన మాట కోసం నేపాల ప్రజల క్షేమం కోసం పుష్కల దేవి గారు ఆత్మార్పణ కు సిద్ధ పడినది కానీ పరమ శివుని భక్తురాలైన పుష్కల దేవిని కాపాడవలసిన బాధ్యత ఆ పరమశివుని దే అని నమ్మి ఆ పరమ శివుడు భూలోక నివాసం ఏర్పరుచుకున్న తన కుమారుడైన ధర్మ శాస్త్ర ను పుష్కల ని కాపాడమని ఆజ్ఞాపించెను.ధర్మశాస్త్ర వారు వెంటనే తన తండ్రి ఆదేశానుసారం ధర్మశాస్త్ర వారు నేపాల్ దేశం వెళ్లి సరిగ్గా మాంత్రికుడు పుష్కల దేవిని కాళికామాత కు బలి ఇవ్వబోతున్న సమయంలో అడ్డుకొని ఆ మాంత్రికుని అంతమొందించి పుష్కల దేవిని కాపాడినాడు నేపాల రాజుకు ధర్మశాస్త్ర వారు ఆ మాంత్రికుని కపట ఉద్దేశము తెలిపి రాజ్యమును కరువు కాటకాల నుండి స్వామి  వారు రక్షించినాడు తాను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడిన రాజు ధర్మశాస్త్ర వారిని క్షమించమని వేడుకుని తన పాపానికి నివృత్తి గా తన కుమార్తెను వివాహమాడమని బ్రతిమాలేను.పుష్కల దేవి సైతం ధర్మశాస్త్ర వారిని చూసిన మొదటి చూపులోనే అతనిని వరించినది అందునా పరమశివుని కుమారుడితో  వివాహము అనగానే ఆమె ఆనందానికి అవధులు లేవు ధర్మశాస్త్ర వారు నేపాల రాజు అయిన రాజు కోర్కెను మన్నించి ఆ పరమశివుని అనుమతి తీసుకొని ధర్మశాస్త పుష్కల దేవిని వివాహమాడెనుఇది ధర్మశాస్త వారు పుష్కల దేవి కళ్యాణ ఘట్టం సమాప్తం.మరియొక సమయమున మలయాళ దేశం నేటి కేరళ లో పింజక వర్మన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని రాజ్యము లోకి కొందరు బేతాళ రాక్షసులు చేరి ఆ రాజ్యంలోని ప్రజలను పట్టి పీడిస్తున్న నారు నిత్యము మారణహోమం సాగించు చున్నారు వారి ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్న నాయి పింజక వర్మన్ రాజు వారికి ఏమి చేయాలో తెలియక అప్పటికే ధర్మశాస్త్ర వారి ప్రభావం గురించి కథలు విన్న పింజక వర్మన్ రాజుగారు ధర్మ శాస్తనే తనని తన రాజ్యాన్ని కాపాడగలదు అని నమ్మి ధర్మశాస్త్ర వారికి నిత్య పూజలు చేయుచుండెను ఆ రాజు పూజలకు సంతుష్టుడైన ధర్మశాస్త్ర వారు ధర్మస్థాపన కై మలయాళ దేశం చేరి బేతాళ రాక్షసులతో భీకరమైన యుద్ధముచేసి రాక్షసులందరినీ అంతమొందించేను.అంతా ఆ మలయాళ దేశమున రాక్షసుల పీడ వదిలిపోయింది అందుకు పరమానందభరితుడై నా పింజక వర్మన్ ధర్మశాస్త వారిని వేనోళ్ళ కొనియాడారు తన రాజ్యాన్ని రక్షించినందుకు ప్రతి ఫలముగా తన కుమార్తె అయిన పూర్ణ దేవుని వివాహమాడ వలసిందిగా వేడుకొనెను ధర్మశాస్త్ర వారు కూడా అందుకు సమ్మతించెను.పింజక వర్మన్ ధర్మశాస్త్ర పూర్ణ వారిరువురి వివాహము అంగరంగ వైభవంగా జరిపించి నాడుధర్మశాస్త్ర వారి రెండో వివాహం గురించి విషయం తెలుసుకున్న నేపాల రాజు అయినా పుష్కల దేవి తండ్రి గారైన పలింజ వర్మన్ కోపంతో రగిలిప పోయి వెంటనే ధర్మ శాస్తా వారిని చేరుకొని నిలదీసి నాడు తన కూతురైన పుష్కల దేవిని వివాహమాడి ఇంకొకరిని ఎలా మరల వివాహము చేసుకున్నామని ధర్మశాస్త్రాను  ప్రశ్నించెను.అందుకు ధర్మశాస్తా వారు ఓ మహారాజా ఈ బంధాలు అనుబంధాలు కోపాలు తాపాలు మానవులకు మాత్రమే వర్తిస్తాయి దేవతలకు వర్తించవు దేవతలు పలుమార్లు వివాహమాడుట సమంజసమే అని వివరించ ప్రయత్నించినట్లు ధర్మశాస్తా…అందుకు కోపోద్రిక్తుడైన మహారాజు ఓహో దేవదేవుడైన పరమశివుని పుత్రుని కనుక ఎన్నిసార్లైనా వివాహ వివాహమాడెదవా మానవులకు ఒక ధర్మం దేవతలకు ఒక ధర్మమా అటులైన నీవు మానవునిగా జన్మించి ఆజన్మ బ్రహ్మచారి గా జీవింతు కాక అని కోపంతో ధర్మశాస్త్ర వారిని శపించెను.అనాలోచితంగా తనని శపించిన కారణంగా ఆ రాజు మీద ఆగ్రహించి ఓ మూర్ఖా చక్రవర్తి అజ్ఞానముతో అర్థం లేని ఆవేశంతో నీ బిడ్డ పై మమకారంతో నన్ను శపించితివో మరు జన్మలో నీకు సంతానము లేక చింతించెదవ్ అని శపించెను.అంత తప్పు తెలుసుకున్న మహారాజు నా అజ్ఞానాన్ని మన్నించి క్షమించమని వేడుకునిను ఆ రాజు పెట్టిన శాపము లోకకళ్యాణం కొరకే అని గ్రహించి ధర్మశాస్త్ర వారు అతన్ని కరుణించి చింతించవలదు రాజా ఆ మరు జన్మలో నీ కుమారుడిగా నీ ఇంట పెరుగుతాయని వరమిచ్చి పూర్ణ పుష్కల సమేతుడై కైలాసము చేరుకున్నారు.కైలాసం చేరుకొని ధర్మ సంస్థాపనార్థాము ప్రభాదేవి అను యువతిని గాంధర్వ వివాహం చేసుకున్నారు శ్రీ ధర్మశాస్త్ర ప్రభాదేవి ల కలయిక తో సత్యకన్ కుమారుడు జన్మించెను.శ్రీ ధర్మశాస్త త్రిలోక పూజ్యుడు. హరహర సుతుడు కావడం వలనా ? కాదు జన్మతః ధర్మ మార్గాన్ని బోధించే గురువు గా పరిగణించడం వలన.అన్ని లోకాలలోని వారు ధర్మం తప్పకుండా ఏర్పాటు చేసుకొన్నమార్గాన నడుచుకొనేందుకు, వారు తెలిసీ తెలియక చేసే పాప కార్యాల నుండి రక్షించేవానిగా శ్రీ ధర్మశాస్త ప్రసిద్ధి.