పేరూరు డ్యామ్ కు నీరు తెచ్చామంటాడు.. బంగారు గనులు తెరిపించానంటాడు

పేరూరు డ్యామ్ కు నీరు తెచ్చామంటాడు.. బంగారు గనులు తెరిపించానంటాడు

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతాడు

అభివృద్ధి చేశాను కాబట్టే... నాకు ఓటు అడిగా హక్కు ఉంది

ప్రజలు గతంలో చేసిన తప్పు మళ్లీ చేయవద్దు

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి

జనం న్యూస్ ఏప్రిల్ 24 జిల్లా ఇన్చార్జ్....పేరూరు డ్యామ్ కు నీరు తెచ్చామంటాడు.. బంగారు గనులు తెరిపించి ఉద్యోగాలు కల్పించామంటాడు.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇలా నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతాడని.. మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రామగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పేరూరు పంచాయతీలోని ఏడుగుర్రాలపల్లి, కురుగుండ్ల కాలనీ, పి.కొత్తపల్లి, పెదయ్యగారి కొట్టాల, దుబ్బార్లపల్లి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. మరికొన్ని చోట్ల ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే ఈ ఐదేళ్లలో జరిగిన కార్యక్రమాలు ఏంటన్నది అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్లలో ఏ రోజైనా మీ గ్రామాలకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వచ్చాడా.. వచ్చి ఉంటే ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించారు కదా మీకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏం చేశాడని నిలదీశారు. పేరూరు డ్యామ్ కు దేవుడు దయ వలన వర్షాలు వచ్చి నీరు వస్తే... అది తన ఘనతగా చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డ్యామ్ నిండితే గేట్లు ఎత్తే పరిస్థితి కూడా లేకుండా చేశారని విమర్శించారు. గతంలో పేరూరు డ్యామ్ కు నీరు అందించేందుకు 800 కోట్ల రూపాయలతో కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాలువ త్రవ్వకం పనులు చేపట్టమన్నారు. అయితే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అది ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటినుంచి ఒక అడుగు కూడా ఈ పనులు ముందుకు పడలేదు అన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారం కూడా అందలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కచ్చితంగా ప్రస్తుత ధర ప్రకారం ప్రతి ఎకరాకి పరిహారం చెల్లిస్తామన్నారు. మరోవైపు రామగిరి బంగారు గనులు తెరిపించి ఎంతో మందికి ఉపాధి కల్పించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో. మీరే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అబద్ధాల నాయకుడుకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దన్నారు. గతంలో తాను ఎంతో అభివృద్ధి చేసిన ఓటు వేయలేదని.. దాని వలన నాకు జరిగిన నష్టం కంటే.. మీకు జరిగిన నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు.....