భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష

భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష

జనం న్యూస్ జనవరి/19

హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 2018కి సంబంధించిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పునిచ్చింది.

వివరాల ప్రకారం.. అదనపు కట్నం కేసులో భార్యను కడతేర్చిన వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. భవానీ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇంజామ్‌ హక్‌ అనే వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను తీవ్ర వేధింపులకు గురిచేసేవాడు..

అంతటితో ఆగకుండా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు.. ఈ క్రమంలో 2018 సంవత్సరంలో ఇంజమ్‌ హక్‌ భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.అదనపు కట్నం కోసం ఇంజామ్‌ హక్‌.. భార్యను కిరాతకంగా హత్యచేసినట్లు ఆధా రాలను సమర్పించారు.

ఈ కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ధర్మాసనం.. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి.. అని పోలీసులు తెలిపారు.జనం న్యూస్ రాజు