మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్.- హైదరాబాద్.

మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్.- హైదరాబాద్.

జనం న్యూస్ 23 మార్చి 2024. :- తన రాజకీయ ఎదుగుదల మాదిగ జాతి వల్లనే అని గతంలో రేవంత్ మాట్లాడిన వీడియో ప్రదర్శించిన మంద కృష్ణ మాదిగ.ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దామని రేవంత్ మాట్లాడిన వీడియో ప్రదర్శించిన మంద కృష్ణ మాదిగ.కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ లు సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేశారని మేము మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ తో మాట్లాడించారు.
మా ప్రశ్నలకు సమాధానం రాలేదు.. కానీ కౌంటర్ ఇప్పించారు.

రేవంత్ రెడ్డి ఎదుగుదలలో మాదిగదే ప్రధాన భాగస్వామ్యం ఉంది అని ఆయనే అన్నారు.

రేవంత్ రెడ్డిది ముమ్మాటికీ మాదిగలకు చేసింది ద్రోహమే.. సంపత్ కు టిక్కెట్ ఇవ్వకుండా చేసింది వెన్నుపోటే.

మాదిగల పట్ల రేవంత్ రెడ్డి తీరు నమ్మక ద్రోహం చేసినట్లు రుజువు అవుతుంది.

సంపత్ కు కాకుండా మల్లు రవి కి టిక్కెట్ ఇప్పించింది రేవంత్ రెడ్డే. యం అర్ పి యస్ 
 ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు సంపత్.
సంపత్ కు టిక్కెట్ ఎందుకు రాలేదో ఆయన  అధిష్టానానికి రాసిన లేఖనే సాక్ష్యం.

నేను మాదిగ జాతి ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టానని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తామని వైఎస్ హామీ ఇస్తే.. అప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాను.

ఇప్పుడు మోడీ ఇచ్చిన హామీ కోసమే బీజేపీ కి మద్దతు ఇచ్చాను.

అంటే అప్పుడు వైఎస్ కాళ్లదగ్గర  తాకట్టు పెట్టునట్లా..?

ఉత్తమ్ కుమార్ రెడ్డి పి సి సి  గా హామీ ఇస్తే. అప్పుడు కాంగ్రెస్ కి యం అర్ పి యస్  మద్దతు ఇచ్చింది.

 రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తే మద్దతు ఇచ్చాం. నేనే ఎల్ బీ నగర్ లో స్వయంగా ప్రచారం చేశాను.ఉత్తమ్ కు నల్గొండలో,కోమటి రెడ్డి కి భువనగిరి లో ప్రచారం చేశాను.

మీకు మద్దతు ఇచ్చినప్పుడు మాదిగ జాతి ప్రయోజనాలు ఎవరి కాళ్ళ దగ్గర పెట్టమో రేవంత్ చెప్పాలి..?

తన జాతి కన్నా ఎక్కువగా మాదిగలే తనని ఈ స్థాయికి తీసుకువచ్చారు అని రేవంత్ చెప్పారు.

రేవంత్ రెడ్డి రుణపడి ఉన్నది మాదిగలకే.. రుణం తీర్చుకోవల్సింది మాదిగలదే..

రేవంత్ సొంత జిల్లాలోని నాగర్ కర్నూల్ సీటు మల్లు రవి కి నేను ఇప్పించ లేదు అని చెప్పగలరా..?

తెలంగాణ లోని అన్ని పార్టీలలో మాదిగలకు 2 టిక్కెట్ లు రావాలి.

బెల్లంపల్లి, చెన్నూరు లో వెంకట స్వామి కొడుకులకు ఎమ్మేల్యే టిక్కెట్లుఇచ్చారు.ఇప్పుడు పెద్దపల్లి లో వివేక్ కొడుకు వంశీకి ఎంపి టిక్కెట్ ఇస్తున్నారు.కేసిఆర్ కుటుంబ పాలన మీద కాంగ్రెస్ అనేక విమర్శలు చేసింది.కాంగ్రెస్ కుటుంబ పాలనకు వెంకట స్వామి కుమారులకు,మనవడి కి టిక్కెట్లు ఇవ్వటమే..నిదర్శనం.
అన్నదమ్ములు, భార్య భర్తలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.కాంగ్రెస్ కుటుంబ పాలన చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి మరచిపోతున్నారు.
ప్రధాని వద్దకు ఎస్సీ వర్గీకరణ కోసం కలసి వెళ్దామని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మరిచారు.రేవంత్ రెడ్డి, ప్రధాని మంత్రిని కలిసినప్పుడు ఎందుకు ఎస్సీ వర్గీకరణ ప్రస్తావించలేదు.
మాదిగలకు అవకాశాలు దక్కకపోవడానికి కారణం.. మల్లికార్జున ఖర్గే.. కొప్పుల రాజు ఇద్దరు మాలలే.
మల్లికార్జున ఖర్గే.. కొప్పుల రాజు తన సీఎం పదవి పికేస్తారో అని మాదిగలకు నమ్మక ద్రోహం చేయడానికి రేవంత్ సిద్ధపడుతున్నారు.

కేసిఆర్ విధానాలను రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు.

రేవంత్ మంత్రి వర్గంలో ఎక్కువ ప్రాధాన్యం రెడ్లకే ఇచ్చారు.

మాదిగలు ఒక్కరే ఉన్నారు

ప్రజా పాలన..ఇందిర పాలన కాదు..రెడ్డి కుల తత్వ పాలన అని 25వ తేదీన నిరుపిస్తాం

మా జాతి ప్రయోజనాల కోసం ఎవరు ముందుకు వస్తె వాళ్ళతో కలిసి పని చేస్తాం.

కమిషన్ లు వేశారు కానీ వాటి సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదు

పది శాతం ఓట్లు లేని మాల లకు టికెట్ల ఎలా వస్తుంది.

స్థానికేతరుడు మల్లు రవి కి ఎలా నాగర్ కర్నూలు టిక్కెట్ ఇస్తారు.రేవంత్ రెడ్డి సంపత్ కు సపోర్ట్ చేశారా.. మల్లు రవికా సీఎం చెప్పాలి

తెలంగాణ 70శాతం మాదిగలు ఉన్నారు.. మూడు రిజర్వుడ్ స్థానాల్లో రెండు రావాలి.

ఎన్ని వందల కోట్ల రూపాయలు వివేక్ కుటుంబం నుంచి ఎవరికి వెళ్ళయో బయట పడదా..?
రేవంత్ రెడ్డి పాలన మీద మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో  భవిష్యత్ లో చూపిస్తాం

మాదిగలను రెచ్చగొడితే..జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

కేసిఆర్ మీద రేవంత్ రెడ్డి చేయించింది డూప్లికేట్ యుద్ధం

???? కేసిఆర్ లా రేవంత్ కూడా మాదిగలను అణచివేసే విధంగా చేస్తే ప్రత్యక్ష  యుద్దమే ఉంటుంది

కేసిఆర్ మాదిరి రేవంత్ సీఎం కుర్చీ పోతుంది.

???? సంపత్ కుమార్ కి వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డే

మా నల్ల కండువా మారలేదు.. మీ మెడలో ఎన్ని కండువాలు మారాయో తెలుసు.

మా విమర్శలకు నేరుగా రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలి.

సామాజిక ఉద్యమ నమస్కారాలతో..గోవిందు నరేష్ మాదిగ యం అర్ పి యస్  రాష్ట్ర అధ్యక్షులు.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా