సారు... ప్రాణాలు పోతేనే స్పందిస్తారా...?

సారు... ప్రాణాలు పోతేనే స్పందిస్తారా...?

 *కాల్వ బ్రిడ్జిలు ప్రమాదంగా మారిన పట్టించుకొని అధికారులు..!*

*అధికారులకు మోరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన*

 *

 జనం న్యూస్ /నడిగూడెం /27జనవరి.

నడిగూడెం మండలంలోని రత్నవరం నుండి త్రిపురవరం గ్రామాల మధ్య ఉన్న కొమరబండ కాలువ బ్రిడ్జి శిధిలావస్థకు చేరి మృత్యుయామపాశం గా మారిందని అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున త్రిపురవరం నుండి రత్నవరం గ్రామానికి వస్తున్న TS 29 H 0405 నెంబర్ గల కారు మేజర్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడం,ఈ ఘటన తెలుసుకున్న గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని కాల్వ లో పడ్డ కారును క్రేన్ సాయంతో బయటికి తీయడం జరిగింది. ఈ ఘటన అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ... ఈ బ్రిడ్జి ఐదు దశాబ్దాల క్రితం నిర్మించడం జరిగిందని, ఈ బ్రిడ్జి శిధిలావస్థకు చేరి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ బ్రిడ్జి తొలగించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అనేకసార్లు విన్నవించుకున్న పట్టించుకోవట్లేదని గ్రామ ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి వద్ద ఎన్ని ప్రాణాలు పోతే స్పందిస్తారో...? అధికారులు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామ ప్రజలు అన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి వాహనదారులకు, రైతులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.