అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టి

అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టి

- అధికారుల కనుసైగల్లో మట్టి వ్యాపారం

జనం న్యూస్ మార్చి 29 మఠంపల్లి ప్రతినిధి

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని రామిరెడ్డి కుంట చెరువు నుండి అక్రమంగా జెసిపిలతో మట్టి తవ్వకాలు జరిపి టక్టర్లతో వేరువేరు ప్రాంతాలకు తరలించి మట్టి డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుండి వేరు వేరు ప్రాంతాలకు మట్టిని సరఫరా చేస్తున్న కొందరు వ్యాపారులు ట్రాక్టర్ కు ఒక రేటు టిప్పర్ కు ఒక రేటు చొప్పున నేరేడుచర్ల పాలికీడు గరిడేపల్లి హుజూర్నగర్ మేళ్లచెరువు మండలాల్లోని ఇటుక బట్టీలకు ఇక్కడి నుండి మట్టిని అక్రమంగా సరఫరా చేస్తూ లక్షలలో వ్యాపారం సాగిస్తున్న కొందరు మట్టి వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇదే అదునుగా మట్టి వ్యాపారానికి తెరలేపిన అక్రమ వ్యాపారులు ఇట్టి వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన రెవిన్యూ శాఖ మైనింగ్ శాఖ పోలీస్ శాఖ యంత్రాంగం ఇంత జరుగుతున్న ఏ అధికారి కూడా మట్టి డంపింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోకపోవడంపై ఏ అధికారులతో సంబంధం లేకుండా లక్షలలో వ్యాపారం చేస్తున్నారంటే దీన్ని వెనుక సూత్రధారులు ఎవరు? ఎవరెవరికి ఎంతెంత ముడుపులు అందుతున్నాయో అర్థం కాని అనంత పద్మనాభం రహస్యం ఇట్టి విషయంపై వివరణ కోరగా ఏ అధికారి కూడా తమకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారు కనీసం చెరువు మట్టిని తోలుకొనుటకు మత్స్య శాఖ సొసైటీ పర్మిషన్ కూడా తీసుకోకుండానే ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారంటే అతిశయోక్తిగా ఉంది