అక్రమ ఇసుక రవాణా అపలి భూగర్భ జలాలు కాపాడాలి

అక్రమ ఇసుక రవాణా అపలి భూగర్భ జలాలు కాపాడాలి

జనం న్యూస్ 29 మార్చ్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ జహంగీర్) : ఆలేరు పట్టణ మున్సిపాలిటీలో అక్రమ ఇసుక రవాణా ఆపాలని భూగర్భ జలాలు కాపాడాలని బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బందెల సుభాష్ గురువారం నాడు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రం బిఆర్ఎస్ పాలనలో నాటి నుంచి నేటి వరకు ఆలేరు నియోజకవర్గాన్ని ఏలిన ఎమ్మెల్యేలు మంత్రులు ఆలేరు ప్రాంతానికి సాగునీరు తెచ్చిన పాపాన పోలేదని గత ప్రభుత్వాలు కాసుల కకృతికి ఆలేరు పెద్ద వాగు నుండి హైదరాబాద్ నగరానికి ఇసుకను తరలించి ఎడారిగా మార్చారని దీనితో ఆలేరు ప్రాంతంలో వ్యవసాయం దుర్భిక్షంగా మారి ఉపాధి లేక రైతులు కూలీలుగా వలస వెళ్లి దిక్కుతోచక ఆర్థిక ఇబ్బంది పరిస్థితుల  కొందరు కుటుంబ పోషణ  బరువై భూములను అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితం వర్షాలు విస్తారంగా కురవడం వలన వాగు ఉధృతంగా ప్రవహించి  దిబ్బలు కూలి ఇసుకమేట ఏర్పడి భూగర్భ జలాలు పెరిగాయని  రైతులకు సాగునీరు తాగునీరుకు కాస్త ఊరట నిచ్చిన కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఆలేరులో ఏర్పడిన ఇసుకను ఎత్తేచ్చగా రాత్రనక పగలనక ఇష్టానుసారంగా అక్రమంగా తోడుతూ భూగర్భ జలాలు అడుగంటేలా చేస్తున్నారని అక్రమ ఇసుక రవాణా చేసే వారికి కొందరు ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా  అనుమతులు ఇస్తూ మరియు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ ఇసుక రావణాదారులు మూడు పువ్వులు ఆరుకాయలుగా వాగునులూటీ చేస్తున్నరని అన్నారు ఈ ఇసుక అక్రమ రవాణా పై గతంలో స్థానిక తహసిల్దార్  కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గాని పట్టించుకోలేదని వాపోయారు ఇకనైనా అక్రమ ఇసుక రవాణాను నియంత్రించక పోతే  స్థానిక రైతులతో జిల్లా రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుల  ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి  అధ్యక్షులు నంద గంగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూల హనుమంతు, ప్రధాన కార్యదర్శులు కళ్లెం రాజు, వడ్డేమాన్ నరేందర్, మునిగంటి సదానందం, చింతకింది భాస్కర్ పాల్గొన్నారు.