అత్యాచారం చేసిన కేసు లో నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష

అత్యాచారం చేసిన కేసు లో నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష

జనం న్యూస్ : 20 నవంబర్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆర్టిఐ తిరుపతి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలానికి చెందిన మహిళ పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 20 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, జడ్జి రమేశ్ తీర్పు ఇచ్చారు. లైజనింగ్ ఆఫీసర్ కే.సాగర్ ఎస్సై సి.ఎం.ఎస్ ఆసిఫాబాద్, కాగజ్ నగర్ సబ్ డివిజనల్ లైసనింగ్ ఆఫీసర్ బాబాజీ గారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో జరిగిన అత్యాచారం ఘటనలో దుర్గం తేజస్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. పోలీసుల విచారణ అనంతరం సాక్ష్యాదారాలతో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పోలీసులు సాక్ష్యులను ప్రవేశపెట్టారు.  ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్ మోహన్ రావు ప్రవేశపెట్టిన సాక్షుల విచారణ అనంతరం కేసు పూర్వపరాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి 376(2),417,420 ఐపిసి సెక్షన్ల కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా జరిమానా విధించారు.