చిరిగిన బట్టలతో బస్టాండ్ లో నిలుచున్న అమ్మాయి..! ఆ తరువాత ఎం జరిగింది..?
జనం న్యూస్: ప్రతిరోజూ ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇది చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటిలో కొన్ని వీడియోలు చాలా భయానకంగా ఉంటాయి.. మరికొన్ని వీడియోలు మానవత్వాన్ని ప్రోత్సహించేలా ఉంటాయి. ఈ రోజు మనం అలాంటీ వీడియోను చూద్దాం. ఇది చూసిన తర్వాత మీరు కూడా పరేషాన్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత, లుంగీ కట్టుకున్న ఆ యువ రైతుకు మీరు థాంక్స్ చెబుతారు. అక్కడ ఓ యువ రైతు లుంగీ కట్టుకుని బస్సు కోసం నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. తన దగ్గర గడియారం లేనందున, సమీపంలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి నుండి సమయం ఎంతని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి చిరాకు పడతాడు. ఇంతలో ఓ అమ్మాయి తన ప్రియుడితో కలిసి అక్కడికి వస్తుంది. కానీ లుంగీ కట్టుకున్న వ్యక్తి రోడ్డుపై నిలబడి కారు కోసం ఎదురు చూస్తుంటాడు. కొంత సేపు కూర్చున్న తర్వాత, ఆ అమ్మాయి ప్రియుడు ఆమెను అక్కడి నుండి వెళ్లిపొమ్మని అడుగుతాడు. అటువంటి పరిస్థితిలో, అమ్మాయి బస్టాండ్‌లో సీటు నుండి లేవగానే, ఆమె లంగా ఏదో పదునైన వస్తువుతో చిరిగిపోతుంది. లవర్ అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితిలో, అమ్మాయి డ్రెస్ వెనుక భాగంలో చిరిగిపోయిందని తెలుసుకుంటాడు. చిరిగిన బట్టలు చూసి ప్రియుడు ఆమెను ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు. అలాంటి పరిస్థితిలో అమ్మాయి సిగ్గుతో అవమానంగా ఫీల్ అవుతుంది. అక్కడే నిలబడి ఉన్న యువ రైతు మొత్తం చూస్తాడు. అలాంటి పరిస్థితిలో, అతను తన లుంగీని విప్పి అమ్మాయికి ఇస్తాడు. మొదట అమ్మాయి లుంగీని తీసుకోవడానికి నిరాకరించింది, కానీ తరువాత దానిని తీసుకుంటుంది. రైతు కూడా ఆ అమ్మాయి ప్రియుడితో ఏదో అంటాడు. దీని తరువాత, అమ్మాయి అతని పాదాలను తాకుతుంది. అదే సమయంలో, అతను సమయం అడిగిన వ్యక్తి కూడా అతని మంచి ప్రవర్తన కారణంగా రైతుకు సెల్యూట్ చేయడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియో నిజమా, ఫేక్ అనే విషయం మాత్రం చెప్పలేం. కానీ అది వేగంగా వైరల్ అవుతోంది. దీనికి 34 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వందలాది మంది కామెంట్లు కూడా చేశారు. నేటికీ పేదలకు మాత్రమే మంచి హృదయం ఉంటుుందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ వీడియోను స్క్రిప్ట్ అని అంటున్నారు.