భార్యను హత్య చేసిన భర్త: కన్నీటి పర్యంతమైన ఆడబిడ్డ
జనం న్యూస్, జులై 12 ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజవర్గం, మైలవరం: స్థానిక మైలవరం లోని రామకృష్ణ కాలనీ నందు నివాసముంటున్న భార్యాభర్తల గొడవ మధ్య కు దారి తీసాయి అక్కడ వివరాల్లో కెల్లాగా..మేమంతా వరండాలో ఆడుకుంటున్నాం ఇంతలో అమ్మ ఇంట్లో నుంచి కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పడిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు. నాన్నే అమ్మను కత్తితో పొడిచాడని నాలుగేళ్ల చిన్నారి చెబుతుంటే.. చూసిన ప్రతి ఒక్కరి మోమున కన్నీరు. ధారలైంది". భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన పట్టణంలోని రామకృష్ణకాలనీలో మంగళ వారం చోటుచేసుకుంది. హతురాలి ఆడపడుచు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మైలవరానికి చెందిన పెనుముక్కల మధుమురళికి తెలంగాణలోనిఖమ్మం జిల్లా మధిరకు చెందిన దురాభవాని (21)తో ఆరేళ్ల కిందట పెళ్లి పెళ్లి జరిగింది. వీరికి నాలు గేళ్ల కుమారుడు వర్షిత్, రెండేళ్ల కుమార్తె జెస్సీ ఉన్నారు. కొన్నేళ్లుగా జి. కొండూరు మండలం కుంట ముక్కలలో మధుమురళి తన తల్లి, సోదరి కుటుం బంతో కలిసి ఉంటున్నారు. అక్కడే గేదెలు మేపుతూ పాల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. గత నెల 22న మధుమురళి మైలవరంలోని రామకృష్ణ లోని ఆంజనేయ గుడి సమీపంలో కొత్త ఇల్లు అద్దెకు తీసుకొని దిగారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతు న్నాయి. ఈ నేప మంగళ దుస్తులు మడతపెడుతున్న భార్యతో గొడవకు దిగిన మధుమురళి ఒక్కరిగా కత్తి తీసుకొని మెడపై ఇష్టానుసారం పొడిచాడు ఆమె సోదరి వాణి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో దుర్గ భవాని అరుచుకుంటూ బయటకు పరుగెత్తి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న సీఐ మోహన ణ్ణి, ఎస్సై హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితు ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్ది సేపటి తర్వాత ఏసీపీ ఎం.రమేష్ ఘటనా స్థలికి చేరుకొని హత్య జరిగిన వైనాన్ని నిందితుడి సోదరి నుంచి అడిగి తెలు సుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
అనుమానంతోనే హత్య?: భార్యపై అనుమానంతో గొడవపడుతుంటే సర్దిచె ప్పామని, ఇంతలోనే అకస్మాత్తుగా కత్తి తీసుకొని పొడిచి చంపాడని నిందితుడి సోదరి వాణి పోలీసులకు తెలిపింది. వదినతో కలిసి ఉదయమే సరదాగా చరవాణిలో ఫొటో దిగానని, సాయం త్రానికి విగతజీవిగా మారిందని కన్నీటి పర్యంతమైనది బాలికల వస్తే గృహంలో పని కుదిరేందుకు మాట్లాడా నని తన వదిన చెపుతుండగా ఇంతలో అన్న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ చిన్న పిల్లలను భుజాన వేసుకుని బోరున విలపించింది. కుంటముక్కలలోనూ అన్న పనులు సరిగా చేసేవాడు. కాదని, తాము పనిచేసేవారమని చెప్పింది.