పాపం ఈ టీచర్ ను పరిగెత్తించి ఏలా కొడుతున్నారో మీరే చూడండి ( వైరల్ వీడియో).
జనం న్యూస్: ఓ విద్యార్థి తల్లిదండ్రులు క్లాసులో ఉన్న ఓ ప్రభుత్వ టీచర్ పై దాడికి పాల్పడ్డారు. నాదేం తప్పు లేదని చెబుతున్నా వినకుండా.. అతడిని పరుగెత్తించి పరుగెత్తించి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు క్లాసులో ఉన్న టీచర్ ను ఎందుకు కొట్టారు? అతడు చేసిన తప్పేంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల. ఇక్కడే భరత్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇదే పాఠశాలలో స్థానికంగా ఉండే ఓ చిన్నారి రెండవ తరగతి చదువుతున్నాడు. బాగా చదివే విద్యార్థి క్లాసులో చివరన కూర్చుని బాగా అల్లరి చేయడంతో టీచర్ ముందు బేంచ్ కు రావాలంటూ ఆ విద్యార్థికి సూచించారు. ఆ విద్యార్థి లేచి ముందుకు వస్తుండగా బేంచ్ తగిలి కిందపడిపోయింది. దీంతో ఆ విద్యార్థికి గాయాలయ్యాయి. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందని ఆ తల్లిదండ్రలు చిన్నారిని ప్రశ్నించగా.. టీచర్ కొట్టాడని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కోపంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు వెళ్లి టీచర్ భరత్ ను ప్రశ్నించారు. నాదేం తప్పులేదని ఆ టీచర్ ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ టీచర్ ను క్లాసు నుంచి పరుగెత్తించి పరుగెత్తించి కొట్టారు. వెంటనే స్పందించిన సదరు టీచర్లు.. ఆ దంపతుల నుంచి టీచర్ భరత్ ను కాపాడారు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అనంతరం టీచర్ భరత్.. తనపై జరిగిన దాడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి చివరికి ఆ చిన్నారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.