జనం న్యూస్ :అటవీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదొక ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి. పెద్ద జంతువులు, క్రూర మృగాలు.. చిన్న జంతువులను చంపితేనే వారి కడుపు నిండుతుంది. అయితే అప్పుడప్పుడూ క్రూర జంతువులకు కూడా షాక్ తగులుతుంది. అందుకు సంబంధించిన వీడియో ఇది. ఇది చూస్తే మీరూ షాక్ అవుతారు. సింహం మాదిరిగా పులి కూడా భయం లేకుండా వేటకు వెళ్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే పులి కూడా భయపడిన సందర్భాలు లేకపోలేదు. ఆ కోవకు చెందిన సంఘటన ఇది. నీళ్లు తాగడానికి వెళ్లిన ఓ పులి పరిస్థితి.. బ్రతుకు జీవుడా అనేలా మారింది. ఓ సరస్సు దగ్గర పులి నీళ్లు తాగడానికి వెళ్ళింది. నీళ్లు తాగడానికి వెళ్లిన సమయంలో అనూహ్యంగా నీటి అడుగు నుంచి ఓ మొసలి ఒక్కసారిగా పైకి లేచి పులిని పట్టుకునేందుకు ప్రయత్నించింది.దీంతో దెబ్బకు భయపడిన పులి.. ఒక్క అడుగు వెనక్కి వేసి.. అక్కడ నుంచి పరుగు పరుగున దూరంగా పారిపోయింది. మొసలి నోటి నుంచి బయటపడి.. బ్రతుకు జీవుడా అని అనేసింది. ఆ సమయంలో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోన్న దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘పులికి భయం ఏంటో తెలిసిందిరా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘పులి చాలా లక్కీరా బాసూ.!’ అని మరొకరు కామెంట్ పెట్టారు. కాగా, ఆ వైరల్ అవుతున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

