నర్సింగపూర్‌లో దెబ్బతిన్న ఈత వనాన్ని పరిశీలించిన దావ వసంత సురేష్

May 23, 2026 | Uncategorized

అక్షర ఆయుధం న్యూస్: 22 మే, జగిత్యాల జిల్లా వార్త విశ్లేషణ: జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఈత వనం దగ్ధమైన ఘటనపై జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె నర్సింగపూర్ గ్రామంలో పర్యటించి, కాలిపోయిన ఈత వనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్టపోయిన గౌడన్నలను కలిసి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ గీత కార్మికులకు జీవనాధారమైన ఈత వనం అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోవడం అత్యంత బాధాకరమని, ఈ నష్టం వల్ల గౌడన్నలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని డిమాండ్ చేసిన ఆమె, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రావు, మహేష్, మల్లేష్ గౌడ్, గంగారెడ్డి, వేణు రావు, చంద్ర రెడ్డి, సన్నిత్, మల్లేష్, మన్మోహన్, గౌడ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper