బొద్దింకను చంపబోయి ఇల్లు తగలబెట్టిన మహిళ: యువతి నిర్లక్ష్యం పై దర్యాప్తు

క్రైమ్ న్యూస్

జనం న్యూస్:

ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింకలు కనిపిస్తాయి. ఇవి ఇల్లంతా తిరుగుతూ చికాకు తెప్పిస్తుంటాయి. వీటిని నిర్మూలించేందుకు జనాల పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు వీటి నిర్మూలనకు సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి కూడా తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. దక్షిణ కొరియాలోని ఒసాన్ నగరంకి చెందిన 20 ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్‌మెంటులో నివాసం ఉంటోంది. గత ఆదివారం ఆ యువతి ఫ్లాట్‌లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ బొద్దింక కనిపించింది. దాంతో దాన్ని చంపడానికి ఆమెఫ్లేమ్‌త్రోవర్ (మండే స్వభావం కలిగిన స్ప్రే) ఉపయోగించి దాన్ని కాల్చిచంపాలని అనుకుంది. అయితే మండే స్వభావం ఉన్న ఈ స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్‌తో నిప్పంటించింది. ఆ బొద్దింక కాలిపోతూ ఇంట్లోని సామాగ్రి కిందకు వెళ్లడంతో మంటలు ఫ్లాట్‌ మొత్తం అంటుకున్నాయి. కాసేపటికే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో అంతస్తులో ఓ మహిళ, తన 2 నెలల బిడ్డ, భర్తతో ఉంటుంది. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భర్త బిడ్డతో క్షేమంగా అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు దిగాడు. ఆమె మాత్రం కిందకు దిగే ప్రయత్నంలో జారి పడిపోయి మృతి చెందింది. అపార్టుమెంటులో మంటలు, పొగ కారణంగా గ్రౌండ్ ఫోర్‌లో నివాసం ఉంటున్న 30 కుటుంబాల్లో మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బొద్దింకను చంపబోయి ఇంతటి ఘోరానికి కారణమైన యువతిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *