
జనం న్యూస్ :కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకురాగానే బస్సుకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12మందికి గాయాలయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకురాగానే బస్సుకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12మందికి గాయాలయ్యాయి.

