వేప చెట్లలో అంతు చిక్కని వ్యాధి – పలు ప్రాంతాల్లో కొమ్మలు ఎండిపోవడం ఆందోళన కలిగిస్తోంది

బ్రేకింగ్ న్యూస్

జనం న్యూస్ : ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఔషధాల గనిగా వ్యవహరించే ఈ చెట్టుకు ఆపదొచ్చింది. ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఔషధాల గనిగా వ్యవహరించే ఈ చెట్టుకు ఆపదొచ్చింది. అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా..? పర్యావరణ పరిరక్షణలో మేలు చేసే ఈ చెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా..? అంటే.. అవునంటున్నారు పల్లెవాసులు.. ఇంతకీ, ఆ చెట్టు ఏంటి..? అసలు ఆ చెట్లకు ఏమైంది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వేపచెట్టు దర్శనమిస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో ఈ వృక్షాలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లను సర్వరోగ నివారిణిగా భావిస్తుంటారు. వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది. అలాంటి వేప చెట్లు రహదారికి ఇరువైపులా.. పొలం గట్లపై ఎక్కడపడితే అక్కడ నీడనిచ్చే చెట్లుగా ఉన్నాయి. నిత్య జీవితంలో వేపచెట్టు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నాయి. పల్లెలు పచ్చగా ఉండేందుకు ఈ వేప చెట్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లను ఇలవెల్పుగా.. దైవంగా కూడా పూజిస్తుంటారు. పల్లెల్లో పచ్చగా కనిపించే వేప చెట్లు ఉన్నట్టుండి మోడు బారిపోతున్నాయి. అంతు చిక్కని తెగులు సోకి వేప చెట్లు కళావిహీనంగా ఉంటున్నాయి. ఆకులు, రెమ్మలు, కొమ్మలు, కాండం ఎర్రబారి చెట్టు మోడుబారిపోతోంది. గతేడాది వేలాది చెట్లకు సోకిన ఈ తెగులు… ఈ ఏడాది మళ్లీ విజృంభిస్తోంది. చిగుర్ల నుంచి ప్రారంభమై మొదలు వరకూ నిలువునా ఎండి పోతున్నాయి. గతంలో కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో కనిపించే ఈ తెగులు ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించింది. దీంతో పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. వేప చెట్లకు కొద్దిగా రోజులుగా అంతు చిక్కని వ్యాధితో చెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. వేప చెట్లు ఎండిపోవడానికి డై బ్యాక్ వ్యాధి కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. టీమస్కిటో బగ్‌ అనే కీటకం వేప చెట్టు ఎండిపోవడానికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శీలింద్రాల ద్వితీయ సంక్రమణ ద్వారా వేపకు ఎండుతెగులు సంక్రమిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రివేళ టీ మస్కిటో బగ్ అనే కీటకం విజృంభించి వేప చెట్టు ఆకు కణజాలంలోని రసాన్ని పీల్చి పిప్పి చేస్తుందని చెబుతున్నారు. దీంతో రెండు మూడు నెలల్లోనే వేపచెట్లు పూర్తిగా నిర్జీవమవుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అధిక వర్షాలు, ఉష్ణోగ్రతలతో ఈ తెగులు సోకుతుందని, సీజన్‌ పూర్తయితే చెట్లు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు.  డై బ్యాక్ వ్యాధి నివారణ చర్యలతో వేప చెట్లను రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 500 లీటర్ల నీటికి 100 గ్రాముల ఎసిటామిప్రిడ్‌, 1,250 గ్రాముల సాఫ్‌ లేదా స్ర్పింట్‌ శీలింద్రనాశిని మిశ్రమాన్ని చెట్టంతా పిచికారీ చేయాలనీ సూచిస్తున్నారు. వీటితోపాటు బోవిస్టిన్, కాలిజిన్, మొనోక్రోటోపాస్, ప్రోపినోపాస్, థయామెధక్సిమ్ అనే ఫెస్టిసైడ్, మైదాకులను ముద్దగా చేసి పిచికారిచేయడం ద్వారా డై బ్యాక్ వ్యాధిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *