30 నిమిషాల్లో రెండు ప్రమాదాలు! అమెరికా సైన్యానికి ఊహించని దెబ్బ!

అంతర్జాతీయ వార్తలు

జనం న్యూస్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ అర్థగంట వ్యవధిలో కుప్పకూలాయి. యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదాలు జరిగాయి. హెలికాప్టర్‌లోని ముగ్గురు, ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు. ప్రమాదానికి చెడు ఇంధనం కారణం కావచ్చని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంవత్సరం దీనితో కలిపి అమెరికా 4 ఎఫ్‌/ఎ-18 ఫైటర్‌ జెట్లను కోల్పోయింది. అమెరికాకు చెందిన రెండు విమానాలు, ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్, దక్షిణ చైనా సముద్రంలో కుప్ప కూలాయి. కేవలం అర్థగంట వ్యవధిలోనే అనగా 30 నిమిషాల సమయంలోనే రెండు వైమానిక వాహనాలు ప్రమాదానికి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది.. అలానే ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడారు. యూఎస్ఎస్ నిమిట్జ్ అనే విమాన వాహక నౌక నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం విశేషం. అధికారులు తెలిపిన ప్రకారం.. ఈ ప్రమాదం మూడు రోజుల క్రితం అనగా అక్టోబర్ 26, 2025 ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు చోటు చేసుకుంది. MH-60R సీ హాక్ హెలికాప్టర్‌ దక్షిణ చైనా సముద్రంలో కూలి పోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది.. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బందిని రక్షించారు.MH-60R సీ హాక్ హెలికాప్టర్‌ కూలిపోయిన అర్థగంట తర్వాత అనగా.. 3.15 గంటలకు బోయింగ్ ఎఫ్ 18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అదే సముద్రంలో కుప్ప కూలిపోయింది. సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా కాపాడారు. ఈ రెండు ప్రమాదాల నుంచి ఐదుగరు సిబ్బందిని కాపాడామని.. వారు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఈ రెండు విమానాలు ఎందుకు కూలిపోయాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.MH-60R సీ హాక్ హెలికాప్టర్‌ కూలిపోయిన అర్థగంట తర్వాత అనగా.. 3.15 గంటలకు బోయింగ్ ఎఫ్ 18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అదే సముద్రంలో కుప్ప కూలిపోయింది. సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్‌లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా కాపాడారు. ఈ రెండు ప్రమాదాల నుంచి ఐదుగరు సిబ్బందిని కాపాడామని.. వారు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఈ రెండు విమానాలు ఎందుకు కూలిపోయాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.తాజా ఘటనతో కలిపి అమెరికా నేవీ నాలుగు ఎఫ్‌/ఎ-18 ఫైటర్‌ జెట్లను కోల్పోయింది. విమాన వాహక నౌక, USS హ్యారీ ఎస్ ట్రూమాన్‌ని మధ్యప్రాచ్చంలో మోహరించినప్పుడు.. వరుస ప్రమాదాలను ఎదుర్కొంది. డిసెంబర్ నెలలో, గైడెడ్ మిసైల్ క్రూయిజర్ USS గెట్టిస్‌బర్గ్ ట్రూమాన్ నౌకకు చెందిన ఎఫ్‌/ఎ-18 జెట్‌ను కూల్చివేసింది. అలానే ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, మరొక ఎఫ్‌/ఎ-18 ఫైటర్ జెట్ ట్రూమాన్ హ్యాంగర్ డెక్ నుండి జారిపడి ఎర్ర సముద్రంలో పడిపోయింది.ఆ తర్వాత మేలో, ఎర్ర సముద్రంలో క్యారియర్‌పై ల్యాండింగ్ అవుతున్న ఎఫ్‌/ఎ-18 ఫైటర్ జెట్ ల్యాండింగ్ విమానాలను ఆపడానికి ఉపయోగించే స్టీల్ కేబుల్‌లను పట్టుకోవడంలో విఫలమై జారి పడిపోయింది. దానిలో ఉన్న ఇద్దరు పైలట్‌లు తప్పించుకోవడానికి బయకు ఎజెక్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదాలకు గల కారణాలు ఇంకా వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *