కాసులు కురిపించే ఆర్గానిక్ బంగారం: ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

జాతీయ వార్తలు

జనం న్యూస్: భారతదేశం ప్రపంచానికి వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందింది. కానీ, ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. బంగారం, వెండితో పాటు, భారతీయ ఆవు పేడకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఏంటి వింటే షాకింగ్‌గా ఉంది కదా.? అయితే, మన దేశ ఆవు పేడకు ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్ ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా..? దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..దీపావళి తర్వాత జరిగే గోవర్ధన పూజలలో ఆవు పేడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పర్వతం రూపంలో పూజించబడే ఆవు పేడకు మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. కానీ భారతదేశంలో, ఆవు పేడ పూజలకు మాత్రమే కాకుండా, వ్యవసాయంలో కూడా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే పేడలోని గుణాలు, దాని లక్షణాల కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. కువైట్, అమెరికా, సింగపూర్, నేపాల్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలు దీనిని చైనా నుండి కొనుగోలు చేస్తాయి. భారతదేశంలో దాదాపు 3 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ప్రతిరోజూ దాదాపు 3 కోట్ల టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తాయి. ఈ పేడను ప్రధానంగా ఆవు పేడ కేక్ తయారీకి ఉపయోగిస్తారు. అయితే, చైనా, బ్రిటన్, కువైట్ వంటి దేశాలలో దీనిని విద్యుత్ ఉత్పత్తి , బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తారు. వ్యవసాయంలో ఎరువుగా దీని వాడకం చాలా ఎక్కువ. ఆవు పేడ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కానీ, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయానికి అధిక డిమాండ్ ఉంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతోంది. సేంద్రీయ, పర్యావరణ అనుకూల ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. ఆవు పేడతో తయారు చేసిన ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి. పంట నాణ్యతను మెరుగుపరుస్తాయి. దిగుబడిని పెంచుతాయి. ఉదాహరణకు, కువైట్ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవు పేడను ఉపయోగించడం వల్ల వారి ఖర్జూర పంట దిగుబడి, పరిమాణం పెరిగిందని గమనించారు. నేల సారాన్ని మెరుగుపరచడానికి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, మానవులకు హానికరమైన రసాయన ఎరువులను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆవు పేడ ఎగుమతుల కోసం భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయి. భారతదేశంలోని పెద్ద పశువుల జనాభా, అధిక పేడ ఉత్పత్తి ఈ డిమాండ్‌ను సులభంగా తీరుస్తాయి. ఉదాహరణకు గత సంవత్సరం, కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడ కోసం భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేసింది. అందువలన, బంగారం, వెండిని వదిలివేసి భారతీయ ఆవు పేడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన ఉత్పత్తిగా మారింది. దాని మతపరమైన, వ్యవసాయ, పర్యావరణ అనుకూల ఉపయోగాల కారణంగా, అనేక దేశాలు దీనిని కొనుగోలు చేస్తున్నాయి. ఆవు పేడ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *