
జనం న్యూస్:బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది. క్యాన్సర్ రోగులలో ముఖ్యంగా నిరుపేద మహిళల్లో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు హరప్రియ పనిచేస్తుంది. క్యాన్సర్ రోగుల కోసం జుట్టును సేకరించి, ఆ కురులతో విగ్గులు తయారు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. ఆమె స్థాపించిన మిషన్ స్మైల్‌లో భాగస్వాములుగా ఉన్న 150 మంది వాలంటీర్లు తరచూ తమ కేశాలను విరాళంగా ఇస్తారు. సహజ కేశాలతో తయారయ్యే విగ్గులను కొనే స్తోమత లేని నిరుపేద మహిళలకు హరప్రియ విగ్గులను తయారుచేసి అందిస్తుంటారు.


 
	 
						 
						