జనం న్యూస్ : ఒక ప్రముఖ వాచ్‌ బ్రాండ్‌ ప్రస్తుతం మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన ఒక వాచ్ డిజైన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆ కంపెనీ ఆ వాచ్‌ను ఆపరేషన్ సిందూర్ పేరుతో డిజైన్ చేయడమే ఈ చర్చకు దారితీసింది. ఈ వాచ్‌ డిజైన్‌పై సోషల్‌ మీడియాల వేదికగా చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ భారతీయులకు ఒక భావోద్వేగమన సంఘటన అని.. దానికి ఇలా వ్యాపారంతో ముడిపెట్టి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాల చావులతో వ్యాపారాలు చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయందని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ఒకప్పుడు బాగా పేరు మోసిన వాచ్‌ బ్రాండ్ HMT.. తాజాగా ఆపరేషన్ సిందూర్ JGSL 01 అనే కొత్త మోడల్‌ మెన్‌ హ్యాండ్ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ వాచ్ స్టీల్ కలర్ కేసు, వైట్‌ కలర్ డయల్, బ్లాక్ లెదర్ బెల్ట్‌తో పాటు.. వాచ్ మధ్యలో నిమిషాల ముల్లు కింద కుంకుమ ఆకరాం, దాని కుడివైపు కుంకుమ చల్లినట్టు కనిపిస్తుంది.ఈ డిజైన్ సిందూర్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.ఈ వాచ్ ధరను రూ.2,400గా పేర్కొంది. అయితే వాచ్ డిజైన్‌పై చాలా మంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్ అంటే ఒక దుఃఖకరమైన, భావోద్వేగమైన సంఘటన.. దాన్ని ఇలా ఒక వస్తువుతో ముడిపెట్టి వ్యాపారం చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ ఏడాదిలోనే అత్యంత చెత్త వాచ్‌ ఇదే అని ఒకరు కామెంట్ చేయగా.. ఈ వాచ్‌ డిజైన్ నివాకిగా కాకుంగా.. వ్యాపారానికి ప్రచారంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ వాచ్‌ డిజైన్‌ ఇంత వివాదానికి కారణం ఏంటంటే.. ఆపేషన్ సిందూర్.. గత ఏప్రిల్‌లో జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 20 మందికిపైగా పర్యాటకులు మరణించారు. దీంతో ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్‌ సైన్యం.. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి.. సుమారు 100 మందికిపై ఉగ్రమూకలను మట్టుపెట్టింది.