జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు క్యాడర్‌కు చెందిన కీలక నేత ఎర్రగొల్ల రవి సహా మరో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కీలక నేత సహా ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్‌తో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ అరెస్ట్‌లతో మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.  మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఈ ఆపరేషన్‌ చాలామంది మావోయిస్టులు మరణించగా.. ఇప్పటికే పలువురు మావోయిస్టుల అగ్రనేతలు సహా మావోయిస్టులు అధికారులు, పోలీసులు సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరింత బలహీన పడింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. నిరంతర నిఘా కారణంగా మావోయిస్ట్ పార్టీ కీలక నేత ఎర్రగొల్ల రవితో పాటు మరో ముగ్గురికి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.