జనం న్యూస్ : ఎవరైనా సరదాగా పొలానికి వెళ్లి పొలం గట్టుపై కూర్చుని పచ్చని పైర్లు చూస్తూ హాయిగా ప్రకృతి అందాలను వీక్షింస్తుండగా.. కొద్ది దూరంలో వారికి తెలియకుండా ఏదైనా క్రూర మృగం గమనిస్తూ వారి దగ్గరకు వచ్చిందనుకోండి.. ఒక్కసారి పరిస్థితిని ఊహించుకోండి. సరిగ్గా అటాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నీ గుండె ధైర్యానికి సలామ్ సామీ అంటున్నారు. ఓ యువకుడు పొలం గట్టుపై కూర్చొని, తన ఫోన్ కెమెరాతో పరిసరాలను రికార్డ్ చేస్తున్నాడు. మొదట, ఇది అతను క్యాజువల్‌గా షూట్ చేస్తున్న సాధారణ వ్యవసాయ దృశ్యంలా అనిపించింది. కానీ అతను జూమ్ చేసిన వెంటనే, అక్కడ సీన్‌ పూర్తిగా మారిపోయింది. తెరపై కనిపించే సీన్‌ చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కెమెరాను మరొక పొలంవైపు తిప్పాడు. ఆ పొలంలో చెరకు ఏపుగా పెరిగి ఉంది. అక్కడ నాలుగు సింహాలు కూర్చుని ఈ యువకుడినే చూస్తూ ఉన్నాయి. వీడియో ప్రారంభంలో, ఆ యువకుడికి, సింహాలకి మధ్య చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కెమెరాను దగ్గరగా తీసికెళ్లినప్పుడు, సింహాల గుంపు ఆ యువకుడి ఉనికిని గమనించినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో కూడా ఓ సింహం ఆ యువకుడినే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సీన్‌ ఎంత ప్రమాదకరమో చూస్తే తెలుస్తుంది. ఇలా క్రూరమృగాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం కోసం ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లడం సరికాదంటున్నారు. అయితే ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలోషేర్‌ చేశారు. ఈ వీడియోను కొన్ని గంటల్లోనే దాదాపు 5 లక్షలమంది లైక్‌ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.