జనం న్యూస్ : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన చేస్తున్న కింగ్ జాకీ క్వీన్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇప్పటికి వరకు తెలుపలేదు. ఒక్కసారిగా దర్శకుడు కేకే మరణించారన్న వార్త బయటకు రావడంతో సినీ ఇండస్ట్రీ అంతా దిగ్భంతి వ్యక్తం చేస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయమైన కిరణ్ కుమార్ పెద్దగా సక్సెస్‌ను సాధించలేకపోయింది. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు కిరణ్ కుమార్. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసోసియేటెడ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన వద్ద దర్శకత్వలో పలు మెలుకువలు నేర్చుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఇండస్ట్రీలో దర్శకుడిగానే కాకుండా హీరోగానూ బిజీగా మారారు. ఈయన హీరో విజయ్ ఆంటోనీ నటించిన  భద్రకాళి సినిమాలో కిరణ్ కుమార్ సీబీఐ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా కిరణ్ కుమార్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘కింగ్ జాకీ క్వీన్’ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్ పరంగా బిజీ అవుతున్న సమయంలో కిరణ్ కుమార్ ఆకస్మిక మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక కేకే మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కాగా, ఇటీవలే మరొక దర్శకుడు కీర్తన్ నాదా గౌడ్ కుమారుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ చిన్నారి మరణ వార్త నుంచి బయటకు రాకముందే మరొక డైరెక్టర్ మరణవార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.