జనం న్యూస్ : పాములు అనేవి ఎప్పటికీ మచ్చిక చేసుకోలేని జీవులు. ప్రపంచంలో కొంతమంది ప్రమాదకరమైన పాములను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తారు. కొందరు పాములను తరచుగా బోనులలో.. గాజు క్యాబినెట్లలో బంధిస్తారు. అవి తప్పించుకుని ఎవరికీ హాని చేయకుండా బంధిస్తారు. కానీ ఈ ప్రమాదకరమైన పాములకు ఎలా ఆహారం ఇస్తారో మీకు తెలుసా? ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కొండచిలువలకు ఆహారం ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం భయానకంగా ఉంది. ఒక చిన్న గదిలో కర్రతో నిలబడి ఉన్న వ్యక్తి.. ఒక క్యాబినెట్ తెరుస్తుండగా, లోపలి నుండి ఒక పెద్ద కొండచిలువ బయటకు వచ్చింది. ఏకంగా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఆకస్మిక దాడితో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ ధైర్యం చూపించి కొండచిలువకు కోడిని తినిపించడానికి ప్రయత్నించాడు. అప్పుడు, కొండచిలువ కోడిని తన నోటిలో పట్టుకున్న వెంటనే, ఆ వ్యక్తి వెంటనే దానిని తిరిగి క్యాబినెట్ లోపల ఉంచి మూసివేశాడు. అదేవిధంగా, తన ప్రాణాలను పణంగా పెట్టి, అతను మరిన్ని కొండచిలువలకు ఆహారం ఇచ్చాడు. ఈ పని ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

