జనం న్యూస్ :హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నిన్న (మంగళవారం) రాత్రి దుర్గానగర్‌ చౌరస్తాలో వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ దుకాణంలో ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్వెటర్లు దుకాణంలోకి దూసుకెళ్లి.. అందులో నిద్రిస్తున్న ఓ తండ్రి, ఇద్దరు కుమారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొడుకు దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ప్రభు మహారాజ్, మరో కొడుకు సత్తునాద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించన స్థానికులు వెంటనే వారి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదం సయమంలో కారులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారయినట్లు చెప్పారు. పట్టుకున్న ఆ ముగ్గురు వ్యక్తులను మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇక పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన దీపక్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.