మంత్రి సురేఖ క్షమాపణ — తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతల ముగింపు సంకేతమా?

తెలంగాణ

జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇంతకు మంత్రి ఏం చెప్పారు.. ఈ సమస్యలకు ఎలా ఫుల్‌స్టాప్ పెట్టారో తెలుసుకుందాం పదండి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిని మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన రచ్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నంలో భాగంగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. సీఎంకి సారి చెప్పి.. మ్యాటర్‌ సెటిల్‌ చేసుకున్నామన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న మిస్‌అండర్ ‌స్టాండింగ్స్‌ కామనే అని చెప్పుకొచ్చారు. ఇటీవల సురేఖ మాజీ OSD సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేయడం.. అతడి అక్రమాలపై విచారణకు ఆదేశించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు కొండా సురేఖ ఇంటికి పోలీసులు రావడంతో.. ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు.. సీఎం రేవంత్‌పైనా సుస్మిత విమర్శలు చేశారు. తదనంతరం జరిగిన పరిణామాలతో సమస్య సద్దుమణిగినా.. వారి మధ్య ఏం జరిగిందో బయటకు రాలేదు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశం తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో.. ఆమె సీఎంకు క్షమాపణలు చెప్పినట్లు ప్రకటించారు. తన కూతురు నోరు జారిందని ఆమె ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగినా.. ఫ్యూచర్‌లో పరిస్థితులను ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *