జనం న్యూస్ : చైనాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు పిల్లి ప్రమాదవశాత్తు రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో పడింది.. బయటకు రాలేక అలాగే, కొన్ని నిమిషాలపాటు మెషీన్‌లోనే బట్టలతో పాటుగా తిరిగింది. డిసెంబర్ 5న తూర్పు చైనాలోని జియాంగ్సు నగరంలో ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి అయిన పిల్లి యజమాని ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వెంటనే వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె చాలా విమర్శలను ఎదుర్కొంది. పిల్లి యజమాని పిల్లిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేశారు. జింటియావో అనే పిల్లి యజమాని తన పెంపుడు పిల్లిని వాషింగ్ మెషిన్ లోపల బట్టలు తీస్తుండగా చూసి షాక్ అయ్యానని చెప్పింది. పిల్లి 10 నిమిషాలకు పైగా యంత్రంలోనే ఉండిపోయింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలో పిల్లి యంత్రం నుండి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అది దాని యజమాని వైపు తడబడుతూ వచ్చింది. దాని ముక్కు ఎర్రగా మారిపోయింది.. దానికి గాయమైందో లేదో తనకు తెలియదని, కాబట్టి దానిని తాకడానికి ధైర్యం చేయలేదని ఆ మహిళ చెప్పింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, జింటియావో పిల్లి యజమాని మరొక వీడియోను షేర్ చేశారు. అందులో పూర్తి ఆరోగ్యంగా ఆడుకుంటున్న పిల్లిని చూపించారు. పిల్లి పాదాలకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బాగా తుడిచి ఎండబెట్టిన తర్వాత ఆ గాయాలు కూడా నయమయ్యాయి. ఈ సంఘటన నుండి నేర్చుకున్న జింటియావో యజమాని వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించుకున్నారు. వాషింగ్ మెషీన్‌లో పిల్లి చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్టు ప్రారంభంలో జియాంగ్సులోని ఒక మహిళ తన పెంపుడు పిల్లి అనుకోకుండా వాషింగ్ మెషీన్‌లో 15 నిమిషాల పాటు ఇరుక్కుపోయిందని చెప్పింది.. యజమాని దానిని కోలుకునే వరకు నిశితంగా పరిశీలించాడు. తూర్పు షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మరో మహిళ తన పిల్లి వాషింగ్ మెషీన్‌లో చిక్కుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వెల్లడించారు. దానికి కాలేయం, గుండె సమస్యలు వచ్చాయని చెప్పారు.

