జనం న్యూస్ : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు పోటీపడబోతున్నాయి. చిరంజీవి హీరోగా చేస్తోన్న మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఐదు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు తమిళ సినిమా జన నాయగన్ తెలుగు రీమేక్ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.తమకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన మరో మూవీకి మెగాస్టార్ చిరంజీవి సాయం చేయబోతున్నారట. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఏదో కాదు.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. వాయిస్ ఓవర్ గురించి ఇటీవలే భర్త మహాశయులకు విజ్ఞప్తి మేకర్స్ మెగాస్టార్‌ను సంప్రదించినట్లు సమాచారం. పోటీ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా స్పోర్టివ్‌గా తీసుకున్న చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. చిరంజీవి వాయిస్ ఓవర్‌తోనే ఈ సినిమా మొదలవుతుందట. రవితేజ క్యారెక్టర్‌ను ఆయనే పరిచయం చేస్తారట. మెగాస్టార్ వాయిస్ ఓవర్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అంటున్నారు. వీటిలో మన శంకర వరప్రసాద్‌గారు మూవీ జనవరి 12న రిలీజ్ అవుతుంటే.. రవితేజ హీరోగా చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న రానుంది.

