
జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్, విజిట్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ ఆల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫాలతో భేటీ అయ్యారు. లూలూ గ్రూప్, అగితా గ్రూప్, మస్దార్ సిటీ వంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి, భారత కాన్సులేట్ జనరల్ విందులో పాల్గొన్నారు.


 
	 
						 
						