ప్రాణాలు మంటల్లో కరిగిపోయిన రహస్యం — కర్నూలు ప్రమాదంపై హృదయాన్ని తాకే వివరాలు!

వైరల్-న్యూస్

జనం న్యూస్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు … భైక్‌ను ఢీకొట్టి, కొద్ది దూరం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు భారీగా ఎగసిపపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినవారు క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఇంత తీవ్రంగా ఉండటంతో బస్సులో నుంచి ఎక్కువ మంది బయటపడేందుకు వీలు లేకుండా పోయింది. అయితే ప్రమాద తీవ్రతకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాయి.  ఈ ప్రమాదం తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు… ప్రమాదానికి గల కారణాలు, మంటలు తీవ్రతకు గల కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నాయి. ప్రమాద స్థలంలో క్లూస్ ఆధారంగా అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని, ఇవి ఒక్కసారిగా పేలడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి. ‘‘తొలుత బైక్‌ను బస్సు ఢీకొట్టిందని… దీంతో బైక్ ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి, పెట్రోల్‌ కారడం మొదలైంది. బస్సును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో బైక్… బస్సు కింది భాగంలో ఇరుక్కుపోయింది. అలానే బస్సు కొంత దూరం వెళ్లింది. ఈ క్రమంలోనే నిప్పురవ్వలు చెలరేగి పెట్రోల్‌కు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. అయతే మంటలు ముందుగా బస్సు లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా కొత్త మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉంది. ఆ మంటల ధాటికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు క్షణాల్లో తీవ్రరూపం దాల్చాయి. దీంతో లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ పై భాగంలో ఉన్నవారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారు మంటల్లో సజీవ దహనం అయ్యారు’’ అని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. అయితే లగేజీ క్యాబిన్‌‌లో ఇన్ని మొబైల్ ఫోన్లు ఎందుకు ఉన్నాయి? అనేది విచారణలో తెెలియాల్సి ఉంది. ఇక, కర్నూలు బస్సు ప్రమాదంలో 27 మంది సురక్షితంగా బయటపడగా… 19 మంది మృతి చెందిట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మృతుల్లో ఆరుగురు ఆంధ్రప్రదేశ్, ఆరుగురు తెలంగాణ, బీహార్, ఒడిశా నుంచి ఒక్కొక్కరు,తమిళనాడు, కర్ణాటకల నుంచి ఇద్దరు చొప్పున మృతులు ఉన్నారు అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మరోకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ బస్సు అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం రోడ్డు రవాణా, రెవెన్యూ శాఖల అధికారులతో హై-పవర్ కమిటీని ఏర్పాటు చేసిందని అనిత విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయని హోం మంత్రి అనిత తెలిపారు. చనిపోయిన వ్యక్తుల డీఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై 16 బ‌ృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని. ..ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు 4 బృందాలు, కెమికల్ విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *